ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రకటన చేశారు. సీఎం జగన్ తాజా సమీక్షలో ఏపీలో రాజకీయ అవినీతి తగ్గిందని కిందిస్థాయి ప్రభుత్వ శాఖల్లో మాత్రం అవినీతి తగ్గలేదని వ్యాఖ్యలు చేశారు. అవినీతి నిరోధక శాఖకు సీఎం జగన్ దాడులు పెంచాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. 
 
సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలు కూడా అవినీతిపై ఫోకస్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అవినీతిపై వచ్చిన ఫిర్యాదులు రుజువు అయితే ఉద్యోగులను ఇంటికి పంపుతామని స్పష్టం చేసింది. సీఎం జగన్ అతి త్వరలో దీనిపై కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. సీఎం జగన్ రాష్ట్రంలో అవినీతిని తగ్గించటం కొరకు అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు మరో కాల్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అవినీతిపై 1100 నంబర్ కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. 
 
గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 అందుబాటులో ఉంది. కొత్తగా ప్రభుత్వం 10044 అనే టోల్ ఫ్రీ నంబర్ అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులోకి తెచ్చింది. ఏసీబీ 1064 అనే టోల్ ఫ్రీ నంబర్ తో పాటు 8333995858 అనే నంబరుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. భారీ స్థాయిలో అవినీతిపై ఫిర్యాదులు వస్తూ ఉండటం వలనే సీఎం జగన్ మరో కాల్ సెంటర్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఈ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సీఎం జగన్ ఇప్పటికే అనేక సందర్భాల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని ప్రకటన చేశారు. 10044 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను ఏసీబీ, ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో స్వీకరించటంతో పాటు ఫిర్యాదుల మీద చర్యల దిశగా యంత్రాంగం పని చేస్తోంది. ఫిర్యాదు రుజువైతే ఇంటికి పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉండటంతో రాష్ట్రంలో అవినీతి తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: