ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విషయం లో సీబీఐ ప్రత్యెక న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ‘ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణ కేసు’ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై నమోదు చేసిన కేసుల విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే అనేక సార్లు జగన్ సీబీఐకి విన్నవించుకున్నారు. 

 

ఈదే విషయమై ఒక ప్రజా ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి పలు దఫాలుగా న్యాయస్థానానికి విన్నవించుకోవటంతో సీబీఐకూడా వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం ఉండదని చెప్పినట్లు సమాచారం.

 

ఆదాయానికి మించిన ఆస్తులు ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో సుమారు ఎనిమిదేళ్ల నుంచీ వైఎస్ జగన్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన గతంలో 16 నెలల పాటు హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కాలాగారంలో శిక్ష ను అనుభవించారు కూడా! 

 

అనంతరం బెయిల్ పొంది బయటకు వచ్చి అలా బెయిల్ పై నే కొనసాగుతున్నారు. కేసు విచారణలో భాగంగా, వైఎస్ జగన్ ప్రతి శుక్రవారమూ న్యాయస్థానానికి హాజరవుతూ వచ్చారు. 

 

కాగా గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ రెడ్డి సారథ్యంలోని వైసిపి ఒక చరిత్రాత్మక విజయాన్ని చేజిక్కించుకుంది. ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపు తున్నారు. 

 

ముఖ్యమంత్రి హోదాల్లో వైఎస్‌ జగన్‌, సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి హాజరు కావటానికి ప్రతిసారీ ₹ 60 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

 

దీనిపై వాదోపవాదాలను విన్న తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జగన్‌ కు మినహాయింపు ఇచ్చింది. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ సీబీఐ కోర్టుకు పలుసార్లు కోరారు.

 

అంతేకాదు, ఢిల్లీకి వెళ్లి పలువురు పెద్దల్ని కూడా ఈ వ్యవహారం పై కలిసినట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చేందుకు సీబీఐ అంగీకరించటంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: