జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ప్రతిపక్షాలకు ప్రధానంగా తెలుగుదేశంపార్టీకి సిబిఐ పెద్ద షాక్ ఇచ్చినట్లే ఉంది. కేసుల విచారణలో జగన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. మొన్నటి వరకూ ఇదే సిబిఐ కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం సాధ్యం కాదని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.  విచిత్రమేమిటంటే  జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటాన్ని తెలుగుదేశంపార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

 

నిజానికి జగన్ కు, వ్యక్తిగత మినహాయింపుకు టిడిపికి ఏమాత్రం సంబంధం లేదు. జగన్ కోర్టుల చుట్టూ తిరగటం, ప్రతి శుక్రవారం విచారణకు హాజరవ్వటం కోసం జగన్ హైదరాబాద్ కు రావటాన్ని టిడిపి కొన్ని వందల సార్లు ఎగతాళి చేసింది. ఇప్పటికీ జగన్ ను  ఫ్రైడే సిఎం అని టిడిపి నేతలు ఎద్దేవా చేయటం అందరికీ తెలిసిందే.

 

తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును కోరటాన్ని కూడా టిడిపి తప్పు పట్టింది. జగన్ కు మినహాయింపు ఇవ్వకూడదంటూ టిడిపి కోర్టును ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. నిజానికి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరటం, ఆ అంశాన్ని పరిశీలించటం పూర్తిగా జగన్-కోర్టు-సిబిఐకి సంబంధించిన అంశం. మధ్యలో టిడిపి కలగచేసుకోవాల్సిన అవసరమే లేదు.

 

కానీ అలాగుంటే అది టిడిపి ఎందుకవుతుంది ? అసలు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదవ్వటానికి చంద్రబాబునాయుడు కూడా కారణమని ఇప్పటికీ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. సోనియాగాంధి, చంద్రబాబు మద్య ఒప్పందం కారణంగానే జగన్ పై తప్పుడు కేసులు మోపి విచారణ పేరుతో  జైల్లో పెట్టారని వైసిపి ఎన్నోసార్లు ఆరోపించింది.

 

మొన్నటికిమొన్న జగన్ కు వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పగానే టిడిపి నేతలు సంబరాలు చేసుకున్నారు. అలాంటిది హఠాత్తుగా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే టిడిపి నేతలు మాత్రం పెద్ద షాక్ తగిలినట్లు ఫీలవుతున్నారు. ఇప్పటికే జగన్ పై విచారణ జరుగుతున్న చాలా కేసుల్లో సరైన ఆధారాలు లేవంటూ కొన్ని కేసులను కోర్టు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటమంటే టిడిపికి పెద్ద షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: