హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద మొన్న జరిగిన కారు ప్రమాదం ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. సినిమాల్లో గాల్లో లేచే కార్లను చూసారు. కాని రియల్‌గా ఇక్కడ గాల్లో ఎగురుకుంటూ వచ్చి జనం మద్యలో పడిన కారును చుసిన వారు ఇది కూడా సినిమా షూటింగ్‌లో భాగమే అనుకున్నారట కాని ఒక ప్రాణం గాల్లో కలిసిందని తెలిసి ఇది నిజంగా జరిగిన ప్రమాదమని గుర్తించారట అంటే ప్రమాద తీవ్రత ఏ స్దాయిలో ఉందో ఊహించవచ్చూ.

 

 

దాదాపు 105 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కారు.. 19 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కింద పడిపోయింది అంటే మామూలు విషయం కాదు. కారు మీద పడిపోవడంతో.. ఇక ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కూతురు ఎదురుగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోవడంతోపాటు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బతికి బట్టకట్టాడు అంటున్నారు.ఇకపోతే ఈ కారు కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు పేరిట ఉంది. ఆయన ఎంపవర్ ల్యాబ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట సొంత సంస్థను నడుపుతున్నారు. ప్రమాదానికి కారణం కారును ఓవర్ స్పీడ్‌తో నడపడమేనని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చారు.

 

 

వేగంగా కారు నడిపినందుకు గానూ ఈ కారుపై పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. మిలాన్ రావు మీద కేసు కూడా నమోదు చేశారు. ఇక ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి పేరు కల్వకుంట్ల కావడంతో.. అతడికి, సీఎం ఫ్యామిలీకి సంబంధం ఏంటని కొందరు ఆరాతీయడం ప్రారంభించారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి సీఎంకు బంధువు కావడంతోనే కేటీఆర్ ఇంత వేగంగా స్పందించారని విమర్శలు చేస్తున్నారు.

 

 

మరికొందరు మాత్రం తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు బాగుందని, బాధితురాలి కుటుంబానికి వెంటనే పరిహారం చెల్లిస్తామని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: