ఆయన దేశానికి ప్రధాని, అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఒక విధంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ తరువాత అంతటి పవర్ ఫుల్ నేతగా కీర్తిని పొందుతున్నారు. ఆయన ఆరేళ్ళ పాలనలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.  ప్రధాని మోడీ అంటే దేశం వెలుపలా లోపలా కూడా అతి పెద్ద ఆకర్షణ.  ఐరన్ మ్యాన్ గా గుర్తింపు పొందిన మోడీని మరొకరు శిక్షించడమా...

 

ఇది నిజమేనా. అంటే నిజమే కానీ ఈ ముచ్చట ఇపుడు కాదు, మోడీ స్కూల్ డేస్ లో అన్న మాట. ఎన్సీసీ క్యాడేట్ గా మోడీ  ఉన్నపుడు ఎన్సీసీ క్యాంపు లో ఉన్న ఓ చెట్టు ఎక్కారు. గాలి పటం దారానికి చిక్కుకుపోయిన పక్షిని రక్షిద్దామని మోడీ చేసిన ఈ సాహసం క్యాంప్ నియమాలకు విరుద్ధం.  దాంతో క్రమశిక్షణ తప్పరంటూ మోడీని క్యాంపులో శిక్షిస్తారని భయపడ్డారట. కానీ మంచి పని చేసావని  అంతా ప్రశంసించారని ప్రధాని చెప్పారు. ఇది తన చిన్నతనం ముచ్చటగా ఆయన మన్ కి బాత్  ప్రధాని మనసులో భావాలను  ఆకాశవాణి ద్వారా ప్రతి నెల ఆఖరు ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో  చెప్పిన మాట.

 

ఈ వారం ఎన్సీసీ క్యాడేట్లతో ప్రధాని తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక క్యాడెట్  వేసిన ప్రశ్నకు తాను రాజకీయాల్లోకి రావాలనుకోలేదంటూ ప్రధాని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు తన‌కు ఆ ఉద్దేశ్యం కూడా లేదని ఆయన అన్నారు. అయితే ప్రజా జీవితంలోకి వచ్చిన తాను పూరిగా ప్రజలకు అంకితం అయ్యాయని ఆయన చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే రాజకీయాల్లోకి రావాలని లేకుండానే వచ్చి ఎన్నో సంచలనాలను  నమోదు చేసిన మోడీ నిజంగా రాజకీయాల పట్ల చిన్ననాడే  మరింత ఆసక్తి నాడే పెంచుకుని ఉంటే ఆయన ఎక్కడి దాకా వెళ్ళేవారో కదా అని అనిపించకమానదు. మొత్తానికి అందరికీ స్పూర్తివంతంగా  ఉండేలా తన బాల్య అనుభవాలను  ఈసారి ప్రధాని మన్ కి బాత్ లో పంచుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: