తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు తెగి సుమారు యాభై రోజులు అవుతున్నప్పటికీ.. వారికి ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ఈ యాభై రోజుల్లో కెసిఆర్ ని చర్చలు జరపాలని.... ఆర్టీసీ కార్మికులు ఎన్నిసార్లు అడిగినా.. కేసీఆర్ దానికి అంగీకరించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. చర్చలు జరిపే ప్రసక్తే లేదు... ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కెసిఆర్ మొండి వైఖరితో... ఆర్టీసీ కార్మికుల యూనియన్లు ఒక మెట్టు కిందికి దిగి... 'ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటానంటే మేము సమ్మె విరమిస్తామని' ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదించింది... కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఆర్టీసీ యధావిధిగా నడపడం చాలా కష్టమని కేసీఆర్ ప్రభుత్వం అభిప్రాయపడింది. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది.


అందుకే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి... కీలక నిర్ణయాన్ని తీసుకుంటూ.. ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. చెప్పినట్లే.. ఆదివారం రోజు.. ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశారు. ఈ నిరసనలో భాగంగా..    అశ్వత్థామరెడ్డి కోరినట్టు..మహిళా ఉద్యోగులు హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఉదయం నుంచే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ నిరసనలో భాగంగా.. ఒక ఆర్టీసీ కార్మికురాలి కూతురు.. తన తల్లి బాధను వివరిస్తూ బోరుమని ఏడ్చింది. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ చిన్నారి ఈ విధంగా అభ్యర్ధన చేసింది. ' కెసిఆర్ తాతకు నమస్కారాలు, మూడు నెలల నుంచి మా అమ్మగారికి జీతం రాక.. ఆమె చేతిలో అస్సలు డబ్బులు లేవు. దసరా దీపావళి పండుగలకు కొత్త దుస్తులు కొనుక్కోలేదు. స్కూల్ ఫీజు కట్టకపోతే మమ్మల్ని ఇంటికి పంపించేశారు. పరీక్షలు కూడా రాయనీయలేదు. తక్షణమే చర్చలకు పిలవాలని కేసీఆర్ తాతను కోరుకుంటున్నా.' అంటూ ఆ బాలిక ఏడ్చింది. పాపం ఈ చిన్నారి రోదించడం చూసి.. అక్కడే మౌనదీక్షలో.. నిరసన లో ఉన్న ఆర్టీసీ మహిళా కార్మికులు కంటతడి పెట్టుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: