చంద్రబాబునాయుడు, నారా లోకేష్ నుండి వస్తున్న ట్విట్టర్ పోస్టులను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఏ పరిశ్రమకు ఒప్పందం జరిగిందని ప్రకటన వచ్చినా వెంటనే తమ హయాంలోనే సదరు పరిశ్రమలకు ఒప్పందాలు కుదిరినట్లు అబ్బా, కొడుకులు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. పైగా అప్పటి ఒప్పందాలను ఫొటో కాపీలను కూడా ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు.

 

ట్విట్టర్లో వీళ్ళ కామెంట్లు, ఫొటో కాపీలు పెట్టటం చూస్తుంటే అందరిలోను అనుమానాలు మొదలవుతున్నాయి. తాజాగా బెంగుళూరుకు చెందిన వీరకంపెనీతో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ఒప్పందం కుదిరింది.  తొందరలోనే ఈ కంపెనీ అనంతపురం ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

వెంటనే లోకేష్ నుండి ట్విట్టర్లో ఓ ప్రకటన వచ్చేసింది. వేరే వారికి పుట్టిన బిడ్డకు తాను తండ్రినని జగన్ చెప్పుకుంటున్నట్లు లోకేష్ ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడే అందరిలోను ఓ అనుమానం మొదలైంది. తమ హయాంలోనే కంపెనీ ఏర్పాటుకు భూ కేటాయింపులు కూడా జరిగితే మరి ఉత్పత్తి ప్లాంటు ఎందుకు పెట్టలేదు ?

 

అలాగే లూలూ గ్రూపు కంపెనీ ఏర్పాటుకు తాను నానా అవస్తలు పడి వాళ్ళ చుట్టూ తిరిగి కంపెనీ పెట్టటానికి ఒప్పించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. 2015లో తాము సాధించుకుని వచ్చిన లూలూ గ్రూపు కంపెనీ ఇపుడు వెనక్కు వెళ్ళిపోయిందంటూ చంద్రబాబు మండిపోయారు. మరి చంద్రబాబు చెబుతున్నట్లు అప్పుడెప్పుడో భూ కేటాయింపులు జరిగితే మరి కంపెనీ ఎందుకు ప్రారంభం కాలేదు ? ఎందుకు నిర్మాణం జరగలేదు ?

 

జరిగింది చూస్తుంటే రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారా ? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. సొంత లాభ మాత్రమే చూసుకుని రాష్ట్రాభివృద్ధిని దారుణంగా దెబ్బకొట్టినట్లే అర్ధమవుతోంది. అవే కంపెనీలతో వైసిసి ప్రభుత్వం మాట్లాడి ఇపుడు రాష్ట్రానికి తిరిగి తీసుకువస్తుంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేకపోతున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: