మహారాష్ట్రలో 24 గంటల్లోనే బల పరీక్ష నిర్వహించాలని సుప్రింకోర్టు బిజెపిని ఆదేశించింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బిజెపి తెరవెనుక మాయ చేసేసి హఠాత్తుగా ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్ష నిరూపించుకునేందుకు గవర్నర్ కోషియారి ఈనెల 30వ తేదీ వరకూ గడువిచ్చారు. అయితే ఆ గడువును ప్రతిపక్షాలు సుప్రింకోర్టులో  చాలెంజ్ చేశాయి.

 

ప్రతిపక్షాల, బిజెపి వాదనలు విన్న సుప్రింకోర్టు 30 వరకూ గడువు ఇస్తు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కోట్టేసింది.  అంటే తాజాగా సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారమే అసెంబ్లీలో బలపరీక్షను నిరూపించుకోవాలి. పరిస్దితులను చూస్తుంటే బిజెపికి భంగపాటు తప్పదని అర్ధమైపోతోంది.

 

గవర్నర్ ను అంటే ఏదోరకంగా మాయచేసింది. కానీ అసెంబ్లీలో ఆ మాయలు పనిచేయవు. ఒకవైపు తమకు బలముందని చెబుతున్న బిజెపి, ఎన్సీపి చీలక వర్గం ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేయటానికి ప్రయత్నాలు తీవ్రం చేస్తోంది. ఎలాగూ 30వ తేదీ వరకూ గడువుంది కాబట్టి బేరసారాలు పూర్తి చేసుకోవచ్చని అనుకున్నది కమలం పార్టీ.

 

కానీ హఠాత్తుగా సుప్రింకోర్టు జోక్యం చేసుకుని బలపరీక్షను 24 గంటల్లోనే నిరూపించుకోవాలని ఆదేశించటమంటే బిజెపికి షాక్ అనే చెప్పాలి. ఇటువంటి వ్యవహారాలే కర్నాటకలో కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కర్నాటకలో కూడా బలం లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసింది బిజెపి. అక్కడ కూడా సుప్రింకోర్టు ఆదేశాలతోనే 24 గంటల్లో బల నిరూపణ చేసుకోవాల్సొచ్చింది. దాంతో యడ్యూరప్ప చతికిలపడిపోయి బలనిరూపణలో ఫెయిలయ్యారు.

 

మొత్తానికి కర్నాటక దిశగానే మహారాష్ట్ర రాజకీయాలు కూడా కంటిన్యు అవుతున్నాయి. మరి 24 గంటల్లోనే బిజెపి+ఎన్సీపి చీలిక వర్గం తమ బలాన్ని ఎలా నిరూపించుకుంటాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు బలమే లేకపోయినా ఉందంట మాయచేసి ఇపుడు బలనిరూపణ సమయంలో చతికిలపడటం బిజెపికి మామూలే అయిపోయింది. మొత్తం మీద 24 గంటల తర్వాత మహారాష్ట్ర సంక్షోభం ముగింపుకొస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: