మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారిపోతోంది. ఏ క్షణానికా క్షణం ఉత్కంఠకు దారితీస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ కు మెజార్టీ అని ప్రశ్నించింది. తప్పనిసరిగా బల నిరూపణ జరపాల్సిందేనని సుప్రీం అభిప్రాయపడింది. 24 గంటల్లో ఫడ్నవీస్ ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలని తీర్పు ఇచ్చింది. ఇరు పార్టీల తరపున వాదనలు విన్న తర్వాత  సుప్రీం తన తీర్పును ప్రకటించింది.

 

 

దీంతో బలపరీక్షకు సిద్ధమేనంటూ ఇటు బీజేపీ ప్రకటించింది. అటు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూడా సుప్రీం తీర్పును స్వాగతించాయి. ఫడ్నవీస్ సర్కార్ కు మద్దతు ఇస్తున్నట్టు అజిత్ పవార్ ఇచ్చిన లేఖను ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు ఇచ్చారు. ఇందులో 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నట్టు కోర్టుకు విన్నవించారు. ఇటు కపిల్ సిబాల్ ఈ మూడు పార్టీల తరపున సుప్రీంలో వాదించారు. అయితే వెంటనే బల పరీక్షకు బీజేపీ సిద్ధంగాలేనట్టు సమాచారం. కానీ సుప్రీం తీర్పును అనుసరించి బీజేపీ బల నిరూపణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తమకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నరన్నది బీజేపీ ధైర్యం. కానీ శరద్ పవార్ మాత్రం వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు మళ్లీ తమ గూటికి వస్తున్నారని.. బీజేపీ గెలుపు అసాధ్యమని అంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమవైపుకు వచ్చేశారని అంటున్నారు.

 

 

సుప్రీం తీర్పుతో మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక స్పీకర్ ను నియమించి బల నిరూపణకు వెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీపీ నుంచి తప్పకుండా 44 మంది ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి అవసరం. కానీ అంతమంది బలనిరూపణ సమయంలో బీజేపీ వైపు ఉండే అవకాశం లేదనేది ఎన్సీపీ గట్టిగా చెప్తోంది. మరోవైపు అజిత్ పవార్ మాత్రం తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. నాతో ఉన్న ఎమ్మెల్యేలు బలనిరూపణలో కూడా తనవైపే ఉంటారని అంటున్నారు. మరి.. మహారాష్ట్రలో పరిణామాలు ఎలా మారబోతున్నాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: