వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతుంది. ఈ ఆరు నెలల్లో సీఎం జగన్ అనేక పజాకర్షక పథకాలు ప్రవేశపెడుతూ పాలనలో దూసుకుపోతున్నారు. అయితే సీఎంతో పాటు మంత్రులు కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో పని చేస్తున్నారో మాత్రం పూర్తి క్లారీటీ రావడం లేదు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, పైగా ఆరు నెలలు కూడా పూర్తి కాకపోవడంతో ఎమ్మెల్యేలు పూర్తిగా ఫీల్డ్ లో దిగలేదని తెలుస్తోంది. అయితే ఏ ఎమ్మెల్యే ఎలా ఉన్నా ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు.

 

పైగా తన పని తీరుతో సొంత పార్టీ ఓటర్లనే కాకుండా.... ప్రత్యర్ధి టీడీపీ ఓటర్లని కూడా ఆకట్టుకుంటున్నారు. ఏ పార్టీ అని చూడకుండా పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో టీడీపీకు ఓటు వేసిన వారు కూడా ఆ ఎమ్మెల్యే పనితీరుని ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా ప్రత్యర్ధి పార్టీ ఓటర్లని సైతం ఆకట్టుకుంటున్న ఎమ్మెల్యే ఎవరో కాదు... టీడీపీ దిగ్గజ నేత అయ్యన్నపాత్రుడుని ఓడించిన నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్. ఇంత‌కు ఉమా శంక‌ర్ గ‌ణేశ్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు స్వ‌యానా సోద‌రుడు అన్న సంగ‌తి తెలిసిందే.

 

మొన్న ఎన్నికల్లో నర్సీపట్నంలో టీడీపీలో తిరుగులేని నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడుపై ఉమా శంకర్ దాదాపు 23 వేల పైనే మెజారిటీతో గెలిచారు. భారీ మెజారిటీతో గెలిచామని రిలాక్స్ కాకుండా ఉమా శంకర్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పథకాలని పార్టీలు వారీగా చూడకుండా అందరికీ అందేలా చేస్తున్నారు. 

 

అదే విధంగా సమస్య ఉందని నియోజకవర్గ ప్రజలు ఎవరు మొర పెట్టుకున్నా వాటిని పరిష్కరించేందుకు ముందుంటున్నారు. అయితే ఇలా పనిచేయడం వల్లే టీడీపీకి ఓట్లు వేసిన వారు సైతం ఉమా శంకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఉమా శంకర్ నర్సీపట్నం నియోజకవర్గంలో నిదానంగా అందరివాడిగా మారిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: