చంద్రబాబునాయుడు వ్యూహాలు చూస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. ఈనెల 28వ తేదీన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటన చేస్తారట. పర్యటన ఎందుకయ్యా అంటే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూడటానికట. తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని భేరీజు వేసి జనాలకు చెప్పటానికట.

 

చంద్రబాబు పర్యటన ఉద్దేశ్యం చూస్తుంటే కచ్చితంగా రచ్చ చేసే ఉద్దేశ్యంతోనే అమరావతి ప్రాంతంలో పర్యటన పెట్టుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది.  నిజానికి చంద్రబాబు హయాంలోనే అమరావతిలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం. జరిగిందంతా నాసిరకమైన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు నిర్మాణాలు మాత్రమే.

 

తాత్కాలిక, నాసిరకం నిర్మాణాలకే చంద్రబాబు వేల కోట్ల రూపాయలు తగలేశారు. ఐఏఎస్, ఐపిఎస్ తో పాటు మరికొందరు అధికారుల క్వార్టర్స్ నిర్మాణాలు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రారంభంకాని నిర్మాణాలను నిలిపేశారు. సగానికి పైగా పూర్తియిన క్వార్టర్స్  నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే చాలాసార్లు చంద్రబాబు ఈ విషయాలను చెప్పారు.

 

మరి కొత్తగా చంద్రబాబు వెళ్ళి చూడాల్సిన అభివృద్ధి ఏముంటుంది ?  అమరావతి ప్రాంతానికి వెళ్ళి జగన్ కు వ్యతిరేకంగా జనాలను లేకపోతే రైతులను రెచ్చ గొట్టటానికి కాకపోతే అసలు పర్యటన ఎందుకు పెట్టుకున్నట్లు ?

 

రాజధాని ప్రాంతానికి చెందిన నేతలు, రైతులతో ఎలాగూ చంద్రబాబు రెగ్యులర్ గా మాట్లాడుతునే ఉన్నారు కదా ? ఇపుడు కొత్తగా మాట్లాడేదేముంటుంది ? ఇన్ని రోజులు వాళ్ళు తన దగ్గరకు వస్తే మాట్లాడుతున్నారు. ఇపుడు తానే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతారు అంతే తేడా.  మొత్తం మీద ఏదో ఓ రకంగా జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు. కాకపోతే ఏ అంశం కూడా కలిసి రావటం లేదు. అందుకనే ఫైనల్ గా రాజధాని ప్రాంతంలో పర్యటన పేరుతో మరో రచ్చకు తెరలేపబోతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: