తేట తెలుగు.. తేనె లొలుకు.. మాటలు చెప్పడానికి ఏముంది చాలా చెబుతాం.. కానీ మనం మాత్రం అవి పాటించం.. మా వారసులకు ఆంగ్ల భాషే ముద్దు.. ఏపీ భావి పౌరులకు మాత్రం తెలుగే ఎక్కువా..?? ఇదీ మన దేశానికి ఉప రాష్ట్రపతి ఘనత వహించిన తెలుగు వ్యక్తి అయిన శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడిన మాటలు.ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి తనకు మాతృభాష పై ఉన్న మమకారం చాటుకున్నారు. గవర్నర్ల సదస్సులో మాట్లాడిన వెంకయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

మాతృభాషలోనే విద్యాభ్యాసం తప్పనిసరి చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. మాతృభాషను ప్రోత్సహించడం, కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. తన ప్రసంగంలో మాతృభాష పై మమకారం చాటిన వెంకయ్య నాయుడు ఇది వరకూ కూడా ఏపీ లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశం పెటినప్పుడు విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ సర్కారు తీసుకొస్తున్న ఇంగ్లీష్ మీడియం చదువులను తప్పుపట్టారు.

 

మొన్న ఆ మధ్య ప్రకాశం జిల్లాలో నాడు-నేడు కార్యక్రమంలో ఓ 9వ తరగతి బాలిక అన్న మాటలను ఎవరూ మరిచిపోలేదు. ‘వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఇంగ్లీష్ మీడియంలో చదువ వద్దని చెబుతున్నారని. వారి మనవలు పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని. వాళ్లకు ఇంగ్లీష్ మీడియంలు మాకు తెలుగు మీడియంలా? మేము ఏం పాపం చేశాం. మా భవిష్యత్తును ఎందుకు కాలరాస్తున్నారని’ ప్రశ్నించింది. అందుకు సంభందించిన వీడియో వైరల్ కూడా అయ్యింది.

 

తెలుగు భాషపై ప్రేమ చూపిస్తున్న వెంకయ్య, పవన్ లు వారి పిల్లలను ఎవరూ తెలుగు మీడియంలో చదివించడం లేదు. మరో 10 ఏళ్లకు అంతా ఆంగ్లమయం. అలాంటి సమయంలో తెలుగులో మన పిల్లలు చదవితే వారి భవిష్యత్తును మనం కాలరాసినట్టే అని అర్థం అవుతుంది. తెలుగు భాషపై అవాజ్యప్రేమ చూపిస్తున్న వారంతా ఏపీ విద్యార్థుల భవితతో ఆడుకుంటున్నట్టే.. ఏపీ లోని జగన్ సర్కారు ఇంగ్లీష్ మీడియంలో తెలుగును తప్పనిసరి చేసింది. అయితే ఇంకా తెలుగు తెలుగు అంటూ విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: