మహారాష్ట్రలో మరో 24 గంటల్లో మెరుపు రాజకీయాలు జరుగబోతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన అనూహ్య తీర్పు నేపథ్యంలో మరో 24 గంటల్లోనే ఫడ్నవీస్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సి వస్తోంది. అయితే అజిత్ వర్గం ఎన్సీపీ నేతలు బలనిరుపణ సమయంలో బీజేపీ వైపు నిలబడతారా అనేదే ప్రశ్న. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్, రిసార్ట్స్.. లో తమ ఎమ్మెల్యేలను తరలిస్తూ కాపాడుకుంటున్నాయి.

 

 

అజిత్ పవార్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలందరూ పశ్చాత్తాప్పడుతున్నారని వారందరూ తమవైపు వచ్చేస్తున్నారని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. దీంతో బీజేపీ మరింత జాగ్రత్త పడుతోంది. ప్రస్తుత పోరులో బీజేపీ మాత్రమే తీవ్రంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే.. రాత్రికి రాత్రి పరిస్థితులు మార్చేసి మహారాష్ట్ర ప్రజలు పూర్తిగా నిద్ర లేవకముందే ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేలా పావులు కదిపింది బీజేపీ అధిష్టానం. ఇంత చాతుర్యం చూపిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు బల నిరూపణ సమయంలో అంతే చాతుర్యం చూపించి ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవాల్సి వస్తోంది. లేదంటే ఇంత మంత్రాంగం నెరిపిన బీజేపీ పరువు పోవడం ఖాయం. గత ఐదేళ్లలో బీజేపీ ఇదే విధమైన ఎన్నో మంత్రాంగాలు నడిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేయించింది. గోవా, కర్ణాటక రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పరిస్థితులు తారుమారైతే బీజేపీ ఇది గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవాల్సిందే.

 

 

దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాను ఎన్సీపీ వైపునే ఉన్నానని తమ నాయకుడు శరద్ పవారేనని ఇప్పటికీ అజిత్ అంటున్నారు. బీజేపీతో కలిసి తాము ఐదేళ్లు ప్రభుత్వం నడిపిస్తామని కూడా అంటున్నారు. మరోవైపు.. అజిత్ పవార్‌ తిరిగి వస్తే శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలను శివసేన ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: