సాధారణ ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే  భయపడే రోజులు పోయాయి ఫిర్యాదు చేస్తే మల్లి చూద్దాములే అనే పరిస్థితి కూడా పోయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అనే పేరు తో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ప్రజల్లో ఎంతో మార్పు తీసుకోని వచ్చింది .


సాధారణ మహిళలు సైతం ధైర్యంగా పోలీస్ స్టేషన్‌‌కి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇక పోలీసులు కూడా ఛాలెంజింగ్ తీసుకుని ప్రజల సమస్యలను తీర్చుతున్నారు అయితే, స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ నుంచే ప్రశంసలు దక్కడంతో ఏపీ పోలీసులు సంతోషం లో మునిగి తేలుతున్నారు .

 

.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ప్రజల మన్ననలు అందుకుంటోంది.  ఇక, పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే భయపడే మహిళలు స్పందన కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. స్పందనలో వస్తోన్న ఫిర్యాదుల్లో 52శాతం మహిళలే  ఇచ్చినవి ఉంటున్నాయి. కేవలం ఆర్జీలు తీసుకోవడమే కాకుండా ఫిర్యాదుదారునికి వెంటనే మొబైల్‌కి అక్నాలజ్‌మెంట్ మెసేజ్ ఇవ్వడం అలాగే నిర్ధిష్టమైన టైమ్ పిరియడ్‌లో సమస్యను పరిష్కరించడం లేదా ఉన్నతాధికారికి రిఫర్ చేస్తూ పరిష్కారాలు చూపిస్తుండటంతో స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. 

 

 గతంలో అధికారులను కలవాలంటే కష్టమయ్యేదని, కానీ ఇప్పుడు వాళ్లే తమ సమస్యలు వింటూ ఆర్జీలు స్వీకరిస్తున్నారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక్కరోజు కాకుండా, కనీసం రెండ్రోజులు, లేదా అంటే ఎక్కువ రోజులు పెడితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. ఒకవైపు స్పందనకు విశేష స్పందన రావడం మరోవైపు స్పందన గురించి సాక్షాత్తు దేశ ప్రధానే స్వయంగా ఆరా తీయడంతో ఏపీ పోలీసులు గర్వంగా ఫీలవుతున్నారు. 


గుజరాత్ వడోదరలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌లో ఏపీ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని మోడీ స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్‌, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్‌, ఫేస్ రికక్నైజేషన్‌, ఈ-విట్‌, డీజీ డ్యాష్ బోర్డ్‌, లాక్డ్ హౌస్‌ మోనిటరింగ్ ఇలా ప్రతి అంశంలోనూ ఏపీ పోలీస్ విధానాలపై ప్రధాని ఆసక్తి చూపించారు. ముఖ్యంగా స్పందన గురించి ప్రధాని కార్యాలయానికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు సూచించారు.  ప్రజలకు పోలీసులకు మధ్య వారధిలా స్పందన కార్యక్రమం పనిచేస్తోందని, స్పందనను మరింత పకడ్బందీగా అమలుచేస్తే, పోలీసుల పట్ల అభిప్రాయం మారడమే కాకుండా, గౌరవం కూడా పెరుగుతుందని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: