గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసిపి మహిళా ఎమ్మెల్యే విడదల రజిని నియోజకవర్గంలో తిరుగుతూ పలురకాల సభలు, సమావేశ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే విడదల రజిని ఒక కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఎమ్మెల్యేకు ఒక అరుదైన ఆకస్మిక అనుభవం ఎదురైంది. అదేంటంటే.. తన నియోజకవర్గ ప్రజలను, ఇంకా స్కూల్ పిల్లలను కలుస్తూ పలకరిస్తూ వరుసగా షేక్ హ్యాండ్  ఇస్తూ వస్తున్న మహిళా ఎమ్మెల్యే బుగ్గను ఒక్క విద్యార్థి ఆకస్మాత్తుగా గిల్లి, అదే చేతిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఇదంతా ఊహించని ఎమ్మెల్యే విడదల రజిని కంగు తిన్నది. అసలేంటి ఈ అబ్బాయి అన్నట్లు చూస్తూ..కొన్ని సెకనుల తర్వాత తేరుకుంది. 

 

ఆపై సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యింది. ఇదంతా చూస్తున్న అక్కడి నియోజక ప్రజలు చిరునవ్వులు నవ్వారు. తనపై ఆ చిన్న స్కూల్ పిల్లాడు చూపించిన ఆప్యాయతకు వైసిపి ఎమ్మెల్యే కూడా ఫిదా అయిపోయి... కోపం తెచ్చుకోకుండా సరదాగా తీసుకొని... తాను కూడా చిన్న చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు ఆ పిల్లోడు చూపించిన ఆప్యాయత... బుగ్గ గిల్లడం వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కెర్లు కొడుతుంది. 'సుశీల్ రావు' అనే వ్యక్తి ఈ వీడియోని ట్విట్టర్ లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఆ విద్యార్థి....ఎమ్మెల్యే విడదల రజిని పై చూపించిన ఆప్యాయతకు ఫిదా అయిపోయారు. 

 

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే విడదల రజిని.. చిలకలూరిపేట నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ను ఓడించి విజయం సాధించారు. విడుదల రజిని ఎప్పుడు వివిధ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: