అమ్మ, తల్లి, జనని..ఇలా అమ్మను మాత్రమే ఎన్నో విధాలుగా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం. ఎలా పిలిచినా అమ్మ అనే పదంలో ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం, జాలి, కనికరం అనేవి ఉంటాయి. తల్లి లేని పిల్లలను కూడా తమ సొంత పిల్లలుగా చూసే గుణం అమ్మలో ఉంటుంది. ఇలాంటి అమ్మ అనే పదాన్ని కొందరు తల్లులు భ్రష్టు పట్టిస్తున్నారు. ఇకపోతే  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మూడు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లిన దీప్తిశ్రీ. మధ్యాహ్నం నుంచి కనిపించుకుండా పోయిన సంగతి తెలిసిందే..

 

 

స్కూల్ దగ్గర బాలిక గురించి ఆరా తీసిన తండ్రి శ్యామ్‌కుమార్.. కూతురు కిడ్నాపైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళ వచ్చి దీప్తిశ్రీని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇక మూడు రోజుల తరవాత పాపం కనిపించకుండా పోయిన  దీప్తిశ్రీ కథ విషాదాంతమయ్యింది. అత్యంత దారుణ స్దితిలో మరణించి కనిపించింది. ధర్మాడి సత్యం టీమ్ ఉప్పుటేరులో గాలింపు చేపట్టిగా సోమవారం మధ్యాహ్నం చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీప్తిశ్రీ ని చంపి మూటలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు తేల్చారు. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.

 

 

మూడు రోజుల మిస్సింగ్ మిస్టరీ ఈ రోజు విషాదంగా ముగిసింది. ఇకపోతే ఉప్పుటేరులో డెడ్‌బాడీని వెతికేందుకు పోలీసులు ధర్మాడి సత్యం టీమ్ సాయం కోరారు. 15మంది టీమ్‌ ఆదివారం నుంచి ఉప్పుటేరులో గాలింపు చేపట్టగా.. సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి దీప్తిశ్రీ ఇక లేదన్న భాదతో తండ్రితో పాటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్కూల్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన పాప, ఇలా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే కాకినాడ పగడాల పేటకు చెందిన సత్య శ్యామ్‌కుమార్‌, సత్యవేణిలకు గతంలో వివాహంకాగా.. దీప్తి శ్రీ సంతానం. రెండేళ్ల క్రితం సత్యవేణి అనారోగ్యంతో చనిపోవడంతో.. శ్యామ్‌కుమార్‌ శాంతి కుమారిని రెండోపెళ్లి చేసుకున్నాడు.. వారికి మరో 13 నెలల బాబు ఉన్నాడు.

 

 

రెండో పెళ్లి తర్వాత కూడా శ్యామ్‌కుమార్ కుటుంబం ఆనందంతో ఉంది. మొదటి భార్య కూతురు దీప్తిశ్రీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తన భర్త మొదటి భార్య సంతానమైన దీప్తిశ్రీపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని భావించిన సవతి తల్లి.. ఆమెను చిత్రహింసలు పెట్టేదట. ఎవరికైనా చెప్తే చంపేస్తానని పాపను బెదిరించిందట. ఓ రోజు బాలిక ఒంటిపై వాతలు పెట్టడంతో.. తండ్రి శ్యామ్ కుమార్ నిలదీశాడు. అదే అనుమానంతో శ్యామ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా అందులో సవతి తల్లి చంప్మినట్లు తేలింది.

 

 

ఆమె చేసిన తప్పును ఒప్పుకుంది. తానే దీప్తీశ్రీని చంపినట్లు చెప్పింది.. పాపను స్కూల్ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లి మెడకు టవల్ బిగించి హత్య చేసి.. దీప్తీశ్రీ చనిపోవడంతో.. డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టేసి ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడవేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. చూశార మనసులో ఉన్నద్వేషం పగగా మారి నిండు ప్రాణం బలి తీసుకోవడమే గాక, పచ్చని సంసారాన్ని నాశనం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: