పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జై ప్రకాశ్‌ పై దాడి జరిగింది. ఈ ఘటన జియాఘాట్‌ ఇస్లాంపూర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. జైప్రకాష్ పోలింగ్ బూత్ ను ఒకసారి చూసి వెళ్దాంమన్నట్లు బయల్దేరాడు. కానీ అక్కడే ఉన్న తౄణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు... బిజెపి అభ్యర్థి జైప్రకాష్ మజుందార్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో.. అది తృణముల్ కార్యకర్తల పనే అని బిజెపి నేతలు హోరెత్తరు. 

 

దాదాపు 50 మంది తృణమూల్ కార్యకర్తలు బిజెపి అభ్యర్థి జయప్రకాష్ పై దాడి చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీని, ఎడిషనల్ ఎస్పీని విధుల నుంచి వెంటనే తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. తృణమూల్ కార్యకర్తల దాడిలో బిజెపి అభ్యర్థి అయిన జైప్రకాష్ కింద పడ్డారు. ఒక తృణమూల్ కార్యకర్త గాల్లోకి ఎగిరి బిజెపి అభ్యర్థి జైప్రకాష్ వీపు మీద కాలితో తన్నడంతో జైప్రకాష్.. కాలవలో ఉన్న చెట్ల పొదలలోకి వెళ్లి పడిపోయాడు. దాడిలో బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు జైప్రకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి దాడిచేసే వర్గాలని చెదరగొట్టారు.

 

పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు జైప్రకాష్ మజుందార్ మాట్లాడుతూ, 'నాకు జరిగిన దాడే బెంగాల్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి నిదర్శనం. ఈ ఘటన నన్నేమి నిరుత్సహపరచదు. నేను పోలింగ్ బూత్ లను సందర్శించడం కొనసాగిస్తాను. ఈ దాడి గురించి నేను ఎలక్షన్ కమిటీ కి ఫిర్యాదు చేశాను." అని చెప్పారు. అయితే తృణమూల్ నేతలు మాత్రం ఈ దాడి మా కార్యకర్తలు చేయలేదంటూ.. స్థానిక ప్రజలే బీజేపీ వారిపై ఆగ్రహించి దాడి చేసారంటూ ఆరోపిస్తున్నారు. 

 

పశ్చిమ బెంగాల్లో కరీంగంజ్ తో పాటు ఖరగ్ పూర్, కలియగంజ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ పోలింగ్ సందర్భంగా గొడవలు మాత్రం బీభత్సంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బిజెపి, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు భయాన్నిగొల్పిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: