రోజురోజుకు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అన్న విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో  సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నెలాఖరు  వచ్చిందంటే సామాన్య ప్రజల పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. చేసే ఉద్యోగాలతో వస్తున్న జీవితాలతో కుటుంబాన్ని కూడా సరిగ్గా పోషించాలేని  పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు . పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో  బండి తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రో ధరల పెరుగుదల బాధలు తట్టుకోలేక నీటితో నడిచే వాహనం వస్తే బాగుండు అనుకునేవారు చాలామంది వాహనదారులు ఉంటారు. కానీ నీటితో నడిచే వాహనం వస్తుంది అనుకోవడం కల  అనుకుని సర్దుకుపోతారు. కానీ నీటితో నడిచే వాహనం ఇప్పుడు కలకాదు నిజం అయింది . ఎలాంటి పెట్రోల్ ఖర్చు లేకుండా కేవలం నీటితో నడిచే వాహనాలు కనిపెట్టారు మన తెలుగు తేజాలు. అదికూడా లీటర్ నీటికి ఒకటి  రెండు కిలోమీటర్లు కాదండోయ్ ఏకంగా  1500 కిలోమీటర్లు నడుస్తుంది ఈ కారు. ఇంతకీ వాటర్ తో  నడిచే కారు ఎవరు తయారు చేసారు...  ఈ కారు కథ ఏమిటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 హైదరాబాద్ కు  చెందిన సుందర్  అనే వ్యక్తి నీటితో నడిచే కారు ని కనిపెట్టాడు. నీటి  నుంచి ఆక్సిజన్ని వేరు చేసి నైట్రోజన్ తో కారు ఇంజన్ ను  నడుపుతున్నాడు  సుందర్. సమస్త కోటి జీవులకు  జీవనాధారం నీరు  అన్న విషయం తెలిసిందే. అలాంటి నీటితో కారు ఎందుకు నడవలేను అనే ఆలోచనతో నీటితో నడిచే కారు ని తయారు చేసాడు సుందర్ అనే హైదరాబాద్ వాసి . నీరు అంటే సాంకేతిక మిశ్రమం హెచ్2ఓ... అంటే  హైడ్రోజన్ ఆక్సిజన్ మిశ్రమమే నీరు . దీంతో నీరు  నుంచి హైడ్రోజన్ ను వేరు చేసే కారుకు ఇంధనంగా ఎందుకు మార్చలేము అనుకున్న  సుందర్ ... దీనికోసం తొమ్మిదేళ్ల పాటు కష్టపడి సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ లుగా  విడగొట్టే హైడ్రోలిసిస్  విధానం ద్వారా వెహికిల్ మైలేజ్ పెంచే  సాంకేతికతను కనిపెట్టాడు సుందర్ .

 

 ఈ  టెక్నాలజీ లో భాగంగా కొన్ని రసాయనాలు కలిపిన నీటిని ఈ కిట్లో   అమర్చాడు సుందర్ . అయితే ఈ ప్రక్రియలో  వాటర్ లోని హైడ్రోజన్ ఆక్సిజన్ ను వేరు వేరుగా విడగొట్టే ప్రక్రియ చేపడుతున్నారు. నీటి  నుంచి విడిపోయిన హైడ్రోజన్ నేరుగా ప్రత్యేక ప్రక్రియ ద్వారా కారు ఇంజన్లోకి  చేరుతుంది. ఆ తర్వాత కారు స్టార్ట్ చేయగానే రయ్యి రయ్యిమంటూ  దూసుకుపోతుంది . దీంతో కారులో  50 శాతం మేర పెట్రోల్ డీజిల్ ఖర్చు తక్కువ అవుతుంది. అంతేకాదండోయ్ ఈ కారులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మామూలుగా అయితే కార్లన్నీ కార్బన్ డయాక్సైడ్ను వదులుతూ ఉంటాయి. కానీ ఈ కారు మాత్రం ఆక్సిజన్ ని బయటకు వదులుతూ ఉంటుంది. దీంతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదు.

 


 ఈ కిట్ ను బైక్ లకు వాడొచ్చు అని చెబుతున్నారు సుందర్. బైక్ లకు  వాడినప్పుడు హండ్రెడ్ సిసి బైక్ లో ఒక లీటరు నీటికి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని సుందర్ చెబుతున్నారు. అయితే ఈ చిత్రం అమర్చుకోవడానికి మాత్రం భారీగానే ఖర్చు అవుతుందని అంటున్నాడు సుందర్. సాధారణ కారులో ఈ కిట్  అమర్చడానికి 10 లక్షల వరకు అవుతుంది అని చెబుతున్నాడు. ముందు ముందు మరికొన్ని ఆవిష్కరణలు చేస్తామని ఈ కొత్త సాంకేతికతను  కనుగొన్న రూపకర్త సుందర్ చెబుతున్నారు. 100% నీటితో నడిచే సాంకేతికతను కూడా కనుగొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: