జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా లో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ జనసేవ  చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించాడు. మొదట టీడీపీకి మద్దతు తెలిపినా...  మొన్నటి 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేసింది.  అయితే జనసేన  భారీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని అందరూ అనుకోగా... జనసేన మాత్రం  ఘోరపరాజయాన్ని చవిచూసింది. పవన్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో పవన్ రాజకీయాలను వదిలి సినిమా లోకి వెళ్తారు అనుకున్నారు. కానీ ఓటమి పాలయినప్పటికీ  పవన్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా అయితే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. 

 

 

 

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంచాలని తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే అంతేకాకుండా ఇసుక కొరత విషయంలో కూడా ఇటీవలే లాంగ్ మార్చ్ కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా గతంలో  పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు పైన కూడా జోరుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా మోదీ అంశాలపై ఘాటు విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పోరాడుతుంటే స్పెషల్ ప్యాకేజీ అంటూ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్  ట్విట్టర్ వేదికగా కేంద్రం పై విమర్శలు గుప్పించారు. 

 

 

 

 ఉత్తర భారతం,  దక్షిణ భారతం  మంత్రి మోడీ అమిత్ షా లపైన పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ బిజెపి నేతలపై ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలకు సంబందించిన ట్విట్లు  అన్ని డిలీట్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పేజీలో  కూడా ఆ ట్వీట్లు కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ కి బిజెపి కి మధ్య మళ్ళీ డీల్ కుదిరింది అన్న అనుమానాలు కూడా ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు . అంతేకాకుండా ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరిని కలిశారు ఏం చేశారు అన్న విషయాలు కూడా ఇప్పుడు వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంటూ తెరమీదికి వార్తలు వస్తున్నాయి. కేవలం జగన్ పై తప్ప  బీజేపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసింది ఎక్కడ లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ పై వస్తున్న ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: