జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎం మాట్లాడినా కూడా సంచలనమే. ఈ మధ్య కాలంలో పవన్ తీసుకున్న యూ టర్న్స్ ఏ రాజకీయ నేత కూడా తీసుకోలేదు. పార్టీ పెట్టిన కొత్తలో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ తరువాత ఒకసారి ఎవరు ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు పై రెచ్చిపోయారు. అలాగే బీజేపీ నేతల పై కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. ఇక ఆతరువాత కొద్దీ రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు.

 

ఇక ఇదే సమయంలో తన ట్విట్టర్ అకౌంట్ను పవన్ రాజకీయ అవసరాలకే ఉపయోగిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచే ప్రజా సమస్యల మీద స్పందిస్తాడు. తన రాజకీయ భావజాలాన్ని వినిపిస్తాడు. ప్రత్యర్థుల మీద విమర్శలూ చేస్తాడు.అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి తాజాగా ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్య చేసిన పొలిటికల్ ట్వీట్ లను డెలీట్ చేసారు. ముఖ్యంగా మార్చి 19 నుంచి ఆగస్టు 21 వరకు పవన్ చేసిన ట్వీట్లన్నీ కనిపించకుండా పోయాయని చెప్తున్నారు. దీనిపై ప్రస్తుతం విపరీతమైన చర్చ నడుస్తోంది.

 

దీనిపై బయట మాత్రం ఒక వార్త వస్తుంది. ఇటీవలి పవన్ ఢిల్లీ పర్యటనకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలని కలిసారని అలాగే కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ తో పవన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని ..ఆ పార్టీతో జనసేన కలిసి పని చేసే అవకాశముందని దీనికోసం ఎన్నికల సందర్భంగా బీజేపీ ని టార్గెట్ చేసిన ట్వీట్లను పవన్ తొలగించాడని అనుకునుటున్నారు. అలాగే జనసేన ని బీజేపీ లో విలీనం చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 

ఏపీ బీజేపీలో సరైన నాయకులు లేని నేపథ్యంలో పవన్తో కలిసి సాగడానికి ఆ పార్టీ కూడా సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో పవన్ బీజేపీ మధ్య ఒక ఒప్పనందం కుదిరింది అని ఈ కారణంతోనే ఎన్నికల సమయంలో బీజేపీ కి వ్యరేకంగా చేసిన ట్విట్స్ ని డిలీట్ చేసి .. బీజేపీ తో చేతులు కలపడానికి సిద్ధమయ్యాడని రాజకీయ ప్రముఖులు కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: