ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా ఆరు నెలలు కావొస్తుంది. అయితే ఈ ఆరు నెలల జగన్ పాలనపై ప్రతిపక్ష టీడీపీ ఐదు సంవత్సరాలకు తగ్గట్టు విమర్శలు చేసింది. అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు....జగన్ ఏ నిర్ణయం తీసుకున్న విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రతిరోజూ విమర్శలు చేస్తూనే వచ్చారు. ఇక టీడీపీకి తోడు జనసేన, బీజేపీలు కూడా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

 

2014లో మిత్రపక్షాలుగా అధికారంలో ఉన్నా ఈ మూడు పార్టీలు...ఇప్పుడు ప్రతిపక్షంలో పొత్తు నడుపుతున్నట్లు ఒకే విధంగా విమర్శలు గుప్పించాయి. అయితే ఇలా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తుంటే..అధికార పక్ష నేతలు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్నే జగన్ పలు మంత్రి వర్గ సమావేశాల్లో కూడా చెప్పారు. తాము చేసే మంచి పనులు ప్రజలకు చెప్పుకోలేక, అటు ప్రతిపక్ష పార్టీల విమర్శలని పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేక కొంత ఇబ్బందులు పడ్డారు.

 

కానీ ఇటీవల కాలంలో అధికార నేతల వైఖరిలో మార్పు వచ్చింది. ప్రతిపక్షాల విమర్శలని ధీటుగా ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా కొడాలి నాని అయితే దుమ్ములేపుతున్నారు. మొదట్లో అంత పెద్దగా స్పందించకపోయిన....ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రతిపక్షాలని ఏకిపారేస్తున్నారు. కొంచెం పరుష పదజాలం వాడిన ప్రతిపక్షాలని మళ్ళీ మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు.

 

నాని వాడుతోన్న భాష సైతం రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంత చ‌ర్చ‌కు వ‌స్తున్నా.. త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా నాని మాత్రం అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక నాని దెబ్బకు ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఆచి తూచి విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే కొడాలితో పెట్టుకోవడం ఎందుకని అనుకుంటుంది. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడితే పరువు పోతుందని కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. మొత్తం మీదైతే జగన్ ప్రభుత్వానికి కొడాలి ఓ సైనికుడులా అడ్డు నిలబడ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: