కరణం బలరాం...గొట్టిపాటి రవికుమార్...చాలా ఏళ్లుగా ప్రకాశం జిల్లాలో ఈ రెండు ఫ్యామిలీలకు రాజకీయ శతృత్వం కొనసాగుతూ వస్తోంది. అయితే వీరికి 2014 ముందు వరకు వేరు వేరు పార్టీలో ఉండి రాజకీయం చేసిన ఆ తర్వాత నుంచి ఒకే పార్టీలో ఉండి రాజకీయం చేయాల్సిన పరిస్తితి వచ్చింది. 2014లో వైసీపీ తరుపున అద్దంకి నుంచి కరణం వెంకటేష్ పై గెలిచిన గొట్టిపాటి ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. అయితే గొట్టిపాటి చేరికని వ్యతిరేకిస్తూ వచ్చిన కరణం...ఒకే పార్టీలో ఉన్నా శత్రువుగానే చూశారు. ఇక టీడీపీలో ఉన్న వీరిరువురి వర్గాలకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి.  

 

అయితే అధినేత చంద్రబాబు పలుమార్లు పిలిచి సర్ది చెప్పడంతో కొంతవరకు ఆగాయి. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి బాబు వ్యూహాత్మకంగా ఆలోచించి కరణం బలరాంని చీరాలలో నిలబెట్టారు. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పార్టీ మార‌డంతో బాబు చీరాల‌లో క‌ర‌ణంను స‌ర్దుబాటు చేశారు. ఇటు అద్దంకిలో మళ్ళీ గొట్టిపాటి పోటీ చేశారు. అయితే రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచిన ఈ ఇద్దరు ఎన్నికల్లో విజయం సాధించారు. గెలిచిన దగ్గర నుంచి వీరు పార్టీలో  పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అలాగే మొదటి నుంచి వీరు పార్టీ మారిపోయే అవకాశముందని ప్రచారం జరుగుతూ వచ్చింది.

 

ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు కరణం బలరాంతో చర్చలు జరిపి, పార్టీలోకి  ఆహ్వానించినట్లు తెల్సింది. ఇదే సమయంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు గొట్టిపాటితో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ కరణం వైసీపీలోకి వస్తే....తాను మాత్రం పార్టీలోకి రానని గొట్టిపాటి చెప్పినట్లు సమాచారం. ఆయన ఉన్న పార్టీలోకి కాకుండా వేరే పార్టీలో వెళతానని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే దీని బట్టి చూసుకుంటే ఈ ఇద్దరులో ఎవరోకరు టీడీపీని వీడటం ఖాయమని తెలుస్తోంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: