చరిత్రలో లేని ఘోర ఓటమి తర్వాత టీడీపీ కంచుకోటలు కుప్పకూలుతున్నాయా? అంటే అవుననే సమాధానం ఎక్కువ వినిపిస్తోంది. మొన్న ఎన్నికల్లో కేవలం 23 సీట్లలో గెలిచి 152 సీట్లలో ఓడిపోయింది. అయితే ఈ 153 సీట్లలో టీడీపీ కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే ఈ స్థానాల్లో ఓటమి తర్వాత పుంజుకోవాల్సింది పోయి నానాటికీ పరిస్తితి దిగజారిపోతుంది. ముఖ్యంగా టీడీపీ ప్రతిసారి అధికారంలోకి అండగా రావడానికి ఉపయోగపడే కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్తితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఈ జిల్లాలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి.

 

2014లో ఇక్కడ 16 సీట్లలో 11 సీట్లు వరకు గెలుచుకున్న టీడీపీ...మొన్న ఎన్నికల్లో మాత్రం 2 సీట్లకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఈ రెండిటిల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వెళ్లడంతో...ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్తితి ఇబ్బందుల్లో పడింది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు తప్పనిసరి అని భావించిన నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్, పెనమలూరులలో టీడీపీ పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు.

 

అటు సొంత పార్టీలోనే మాజీ మంత్రి దేవినేని ఉమా మీద రోజురోజు వ్యతిరేకిత పెరుగుతున్న నేపథ్యంలో మైలవరంలో కూడా టీడీపీ భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఇక ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న తిరువూరు, నూజివీడు, గుడివాడ, పామర్రులు వైసీపీ అడ్డాలుగా మారిపోయాయి. అలాగే పెడన, బందరు, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లో వైసీపీ డామినేషన్ పెరిగిపోయింది. ఇటు విజయవాడ వెస్ట్ ఎప్పుడు టీడీపీకి అనుకూలం కాదు. ఇక వీటి అన్నిటి మీద విజయవాడ తూర్పు కాస్త టీడీపీకి అనుకూలంగా ఉంది.

 

కాకపోతే ఇటీవల ఇక్కడ టీడీపీ నేత దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్ళి, ఆ పార్టీ ఇన్-చార్జ్ కావడంతో వచ్చే ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు. అటు బందరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ వీక్ గానే ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలంగానే ఉంది. దానికి తోడు కేశినేని నాని ఎంపీగా ఉండటం కలిసొచ్చే అంశం. మొత్తం మీద చూసుకున్నట్లైతే కృష్ణాలో టీడీపీ కంచుకోటలు నిదానంగా కుప్పకూలుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: