హైదరాబాదు లోని గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదం మహానగరంలో తీవ్ర కలకలం రేపింది. ఎవరూ ఊహించని రీతిలో ఫ్లైఓవర్ పైన వెళుతున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టి క్రింద ఉన్న ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అసలు తప్పు ఎక్కడ జరిగింది మరియు ఆ ఫ్లైఓవర్ పై వాహనాలు తిరిగేందుకు ఆమోదయోగ్యమా కాదా అన్న విషయం పైన ఒక కమిటీని నియమించారు. ఫ్లై ఓవర్ డిజైన్, ప్రమాద నివారణ చర్యలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కేటీఆర్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ తో పాటు లీ అసోసియేట్ ప్రైవేట్ సంస్థల తో కలిపి నియమించిన కమిటీ కి ఆదేశించారు. 

 

శనివారం మధ్యాహ్నం బయోడైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్ పై నుంచి టీఎన్ 09 సీడబ్ల్యూ 5859 నంబరు గల ఫోక్స్ వ్యాగన్ పోలో కారు అతివేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందకు పల్టీలు కొట్టింది. చెట్టు కింద నిలుచున్న ప్రయాణికుల పై దూసుకొచ్చింది. మొదట వంతెన కింద ఉన్న రోడ్డుపై పల్టీకొట్టిన కారు..అదే వేగం తో బలంగా చెట్టును తాకింది. ఆ ధాటికి కూకటివేళ్ల తో సహా చెట్టు కూలిపోయింది. 

 

ప్రమాదంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న మణికొండ కు చెందిన సత్య వేణి అక్కడికక్కడే మరణించింది. అతి వేగంతో దూసుకు వచ్చిన కారులో ఉన్న అతను మరియు అతని కూతురు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరగా అదే సమయంలో లో కింద ఒక అమ్మాయిని పైన హోర్డింగ్ పడబోయి మిస్ అయింది. అయితే ముందు నుంచి వంతెన డిజైన్ లోనే లోపాలు ఉన్నాయని అందుకే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: