ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందుకుని, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, మొదటి నుండి ప్రజాకర్షక మరియు ప్రజలకు మేలు చేసే పలు పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో తమ మ్యానిఫెస్టోలో తెల్పిన విధంగా ఒక్కొక్క పధకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్న సీఎం, నేటి నుండి రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కోసం 14400 ఫోన్ నెంబర్ తో ఒక కాల్ సెంటర్ ని ప్రారంభించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు మరియు మంత్రుల సమక్షంలో కాల్ సెంటర్ ని ప్రారంభించిన సీఎం జగన్, తొలిసారిగా తానే కాల్ సెంటర్ కి ఫోన్ చేసి దాని పని తీరు, వివరాలు, 

 

అలానే ఎవరైనా అవినీతి విషయమై ఫోన్ చేస్తే, వారి నుండి సమాచారాన్ని ఏ విధంగా నమోదు చేతురు తదితర విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలానే ఆ కాల్ సెంటర్ నిర్వహణకు సంబంధించి సీఎం పలు సూచనలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా జరిగిన అవినీతిని ఈ 14400 నెంబర్ కు ఉద్యోగులు లేదా పౌరులు నిర్భయంగా ఫోన్ చేసి తెలియపరచవచ్చని, అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు కాల్ సెంటర్ నిర్వాహకుల వద్ద భద్రంగా రికార్డు చేయబడడంతో పాటు వాటిని ఎంతో గోప్యంగా ఉంచడడం జరుగుతుందని సీఎం అన్నారు. అలానే ఫిర్యాదుదారుడి నుండి ఫిర్యాదు అందిన 15 నుండి 30 రోజుల్లోగా అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 

 

వ్యవస్ధపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో సెంటర్ ఉద్యోగులు గట్టిగా చొరవ తీసుకోవాలన్నారు. అందిన ఫిర్యాదుని ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ లో పొందుపరిచి, వాటిని ఆయా సంబంధిత జిల్లాల అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియపరచడం జరుగుతుందని, అలానే ఉన్నత అధికారులు వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి అవినీతిపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. కాగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై చాలావరకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు పలువురు మంత్రులు మాట్లాడుతూ చెప్పారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: