ఆర్టీసీ కార్మికులకు కేసియార్ బిగ్ షాక్ ఇచ్చారు. సమ్మె మానేసి విధుల్లో చేరాలని సిద్ధపడిన కార్మికులకు చుక్కెదురైంది. లేబర్ కోర్టులో కేసు తేలేంత వరకూ ఏ ఒక్క కార్మికుడిని, ఉద్యోగిని విధుల్లోకి చేర్చుకునేది లేదని ఎంపి స్పష్టం చేయటంతో 48 వేలమంది కార్మికుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. సమ్మె మానేసి విధుల్లో చేరుతామని ఒకవైపు ఉద్యోగులు బతిమలాడుకుంటున్న కుదరదు పొమ్మని ప్రభుత్వం చెప్పటం బహుశా ఇదే మొదటిసారేమో.

 

కార్మికుల కోణంలో ఆలోచిస్తే సమ్మె చేసే ఓపిక కూడా వాళ్ళకు లేదని అర్ధమైపోతోంది. అందుకనే తమ డిమాండ్లలో ఏ ఒక్కటి నెరవేర్చటానికి ప్రభుత్వం ముందుకు రాకపోయినా సమ్మె విరమిస్తున్నారంటేనే అర్ధమైపోతోంది వాళ్ళెంత ఫెయిలయ్యారనే విషయం. చచ్చిన పామును మరింత కొట్టడమన్నది కేసియార్ కు కూడా అంత మంచిది కాదు.

 

ఇపుడేదో కార్మికులు, ఉద్యోగులు కాళ్ళబేరానికి వచ్చారు కదాని వాళ్ళని అవమానిస్తే, చిన్న చూపు చూస్తే రేపు కేసియార్ కు అవసరం అయినపుడు వాళ్ళు ఇంతకింతా కసి తీర్చుకుంటారు. కాబట్టి లేబర్ కోర్టని, అదని ఇదని కండీషన్లు పెట్టి వాళ్ళని మరింతగా చావకొట్టటం కేసియార్ మానుకుంటే అందరికీ మంచిది.

 

ఇప్పటికే సమ్మె అంటేనే కేసియార్ ఎటువంటి వైఖరితో ఉంటారనే విషయం అందరికీ అర్ధమైపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఏ శాఖలోని ఉద్యోగులు కూడా సమ్మె అన్న మాటను కలలో కూడా తలపెట్టరు. ఒకవేళ సమ్మె అంటేనే ఏమవుతుందో అందరికీ అర్ధమైపోయింది కాబట్టి కేసియార్ అంటేనే వణికిపోతున్నారు. కాబట్టి వాళ్ళల్లో ఆ భయం అలానే ఉండాలంటే కేసియార్ తక్షణమే వాళ్ళందరినీ విధుల్లోకి చేర్చుకోవాలి.

 

ఇప్పటికే సమ్మె చేసిన వాళ్ళు మూడు నెలల జీతాలను పోగొట్టుకున్నారు. సమ్మె కాలంలో జీతాలు ఇవ్వనని కేసియార్ ఇప్పటికే కోర్టుకు చెప్పేశారు. కాబట్టి ఉద్యోగులు జీతాలను కూడా కోల్పోక తప్పదని తేలిపోయింది. ఈ పరిస్ధితుల్లో ఇటు జీతాలు కోల్పోయి అటు ఉద్యోగాల్లోకి చేర్చుకోకపోతే వాళ్ళ బతుకులు చాలా దుర్భరంగా మారిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కేసియార్ తన ధోరణిని మార్చుకుంటే అందరికీ మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: