తెలంగాణాలో ఆర్టీసీ 52 రోజుల నుండి సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలవలేదని వ్యాఖ్యానించారు. నైతిక విజయం కార్మికులదేనని ప్రకటించారు. తమ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించామని చెప్పారు. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు సోమవారం (నవంబర్ 25) సాయంత్రం ఆయన ప్రకటించారు.

 

 

ఇకపోతే మొదటి నుండి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో తెలంగాణ సీయం సముఖంగా లేరని చాలాసార్లు నిరూపణ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే సమ్మె విరమించాలని మూడుసార్లు అవకాశమిచ్చిన కార్మిక నాయకులు పెడచెవిన పెట్టారు. ఈ విషయంలో కోర్టుకెక్కిన కూడా వారికి న్యాయం జరగలేదు. ఎన్నో మలుపులు తిరుగుతూ ఆర్టీసీ సమ్మె చివరికి మళ్లీ తెలంగాణ సీయం కేసీయార్ దగ్గరికే చేరింది. ఇప్పుడు సమ్మె విషయంలో కేసీయార్ సీతయ్యలా వ్యహహరిస్తూ ఉన్నారు.

 

 

ఇకపోతే రేపటినుండి విధుల్లోకి చేరాలనుకుంటున్న కార్మికులకు టీఎస్ఆర్టీసీ  కీలకనిర్ణయం తీసుకుంది. వీరు తమంతట తాముగా విధులకు గైర్హజరై సమ్మె చేశారు. ఇన్ని రోజుల నుండి ఇంత రాద్దాంతం జరిగాక విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ ఎండీ  తెలిపారు.  ఇకపోతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను కల్పించి కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.

 

 

హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెను నవంబర్ 25 నుంచి విరమిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులందరూ వెంటనే వారి విధులకు హాజరు కావాలి. కార్మికులకు అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. కాని వారి కోరికను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన్నించే స్దితిలో లేదు అన్న విషయం క్షుణంగా అర్దం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: