ఎన్సీపీ చీలికవర్గం నేత , మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు అసలు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నది ప్రశ్నార్ధకంగా మారింది . అజిత్ పవార్ వెంట 29 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది . అయితే ఇప్పటికే అజిత్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ గూటికి చేరుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు .

 

అయితే అజిత్ ఎన్నికలకు ముందు పలువురు ఎమ్మెల్యేలకు ఆర్ధికంగా పెద్ద మొత్తం లో సహాయం చేశారని , ఇప్పడు వారంతా అజిత్ వెంటనే నిలిచే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు . ఒక్క తమ పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారికి కూడా అజిత్ ఆర్ధిక సహాయ , సహకారాలు అందించారని అంటున్నారు . వారు కూడా అజిత్ తో టచ్ లో ఉన్నట్లు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు . మహారాష్ట్ర లో ఎన్సీపీ చీలిక వర్గం తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసిన విషయం తెల్సిందే . అసెంబ్లీ లో బలపరీక్ష  నెగ్గేందుకు బీజేపీ నేతలు తమకు ఎంతమంది మద్దతు ఇస్తారన్న దానిపై లెక్కలు కడుతున్నారు .

 

బీజేపీ తరుపున 105 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా , 15  మంది ఇండిపెండెంట్ లు మద్దతునిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు . 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ కి మద్దతునిస్తున్నట్లు లేఖలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇక  అజిత్ వర్గానికి చెందిన  27 నుంచి 30  మంది  ఎమ్మెల్యేలు తమకు మద్దతునినిచ్చే అవకాశముందని అంచనా  వేస్తున్న బీజేపీ నాయకత్వం అదే జరిగితే 143 , 146  మంది మద్దతు లభిస్తుందని వారు లెక్కలు కడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: