సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టారంటూ, అదుపులోకి తీసుకున్న కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి చూపించలేదు. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన విషయంలో ఏపీ పోలీసుల తీరు.. వివాదాస్పదమవుతూండగానే.. కొత్తగా జనసేన నేతలపై పోలీసులు పెట్టిన కేసులపై.. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జనసేన నేతలపై పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 

 


   అక్టోబర్ 17న గుంటూరు జిల్లా దుర్గి మం. ధర్మవరంలో జన సైనికులు ఓ నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదంటూ.. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 34 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఒక పోలీస్ అనాలోచిత నిర్ణయం కారణంగా, అతడి పక్షపాత ధోరణి వల్ల ధర్మవరం గ్రామంలో అశాంతి రాజ్యమేలుతుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అక్రమకేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జనసేన లీగల్ సెల్ హైకోర్టులో పిటిషన్ వేసి.. అది అక్రమ కేసు అని వాదిస్తూ.. ఆధారాలను సమర్పించింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు పోలీసులపై మండిపడింది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా కేసు ఎలా పెడతారని పోలీసుల్ని ప్రశ్నించింది. 

 


    ఈ ఒక్క కేసు మాత్రమే కాదు.. ఏపీలో రాజకీయ కారణాలతో… ఇతర పార్టీలపై పెట్టే కేసులు భారీగా నమోదవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అనే తేడా లేదు.. ఎవరైనా.. తమకు ఎదురు వస్తే.. వారిని పోలీసుల దగ్గరకే తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో.. గ్రామాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరగా రాజకీయనాయకుల ఒత్తిడి మేరకు వారు పేరు తున్న కేసులు వారికి తలా నొప్పిని తెస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: