కేసీఆర్ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి .. అందుకే తన రాష్ట్రంలో ఏదైనా ఉద్యమం వస్తే ఎలా అణచివేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమం చూస్తుంటే అలానే అనిపిస్తుంది. చివరికి కార్మికులే ఉద్యోగాల్లో చేరతామని ముందుకు వస్తున్నారు. చివరకు.. కార్మికులు డిపోలకు వెళ్లి.. మేం ఉద్యోగాల్లో చేరతామని వేడుకుంటున్నా.. నో.. పై నుంచి ఆదేశాలు రాలేదంటూ వెనక్కి పంపించేస్తున్న దుస్థితి. సమ్మె ప్రారంభమై యాభై ఒక్కరోజులైంది. చూస్తుండగానే మూడు నెలలుగా జీతాల్లేక ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారు. ఏదో చేస్తుందని భావించిన హైకోర్టు నుంచి ఆశించినంతగా ఆదేశాలు రాక పోవటం.. నమ్ముకున్న విపక్షాలు చేతులెత్తేయటం తో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి త్రిశంక స్వర్గంగా మారింది. ఇప్పుడు సారు దయ తప్పించి తమను మరేమీ ఆదుకోలేవన్న విషయం ఆర్టీసీ ఉద్యోగులకు క్రమంగా అర్థమవుతోంది.



ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ఎవరి మీది ఆశలు పెట్టుకోవటం లేదు. ఎందుకంటే చివరికి కోర్ట్ కూడా చేతులెత్తేసింది. సమ్మె మొదట్లో ఇబ్బంది పడిన ప్రజలు.. సుదీర్ఘంగా సాగుతున్న సమ్మె తో ఎవరికి వారు.. వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాల్ని చూసుకుంటూ సమ్మె కారణంగా పడే చికాకుల్ని తగ్గించుకుంటున్నారు. ప్రజల నుంచి అసౌర్యానికి గురవుతున్నట్లుగా కంప్లైంట్లు పెద్దగా రాని నేపథ్యం లో కార్మికుల సంగతి చూడాలన్న సారు పట్టుదల అంతకంతకూ పెరిగి పోతోంది. మీడియా సైతం పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం తో ఆర్టీసీ కార్మికుల కు కేసీఆర్ తప్పించి వేరెవరూ ఆదుకోలేన్నట్లు పరిస్థితి మారింది.

 

కేసీఆర్త మాత్రం తననే లెక్కచేయరా .. అని తన ఈగో తో కార్మికులను దెబ్బ కొడుతున్నారు. తన నోట్లో నుంచి ఒక మాట వచ్చాక ఆ విషయంలో వెనక్కి తగ్గటం అన్నది తన హిస్టరీలో లేదన్నట్లుగా ఫీలయ్యే కేసీఆర్.. కార్మికులను మన్నించే అవకాశమే లేదు. అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే తప్పించి ఆయన వైఖరి లో మార్పు రాదు. ఈ నేపథ్యం లో ఆర్టీసీ కార్మికుల కడగండ్లు అంతకంతకూ పెరిగేవే తప్పించి తగ్గేవి కాదన్నది నిజం. మొత్తంగా కార్మికుల భవిష్యత్తు కేసీఆర్ చేతిలో మాత్రమే ఉందన్నది సత్యం

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: