ప్రస్తుత మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తున్న  కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన పార్టీలు ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన 24 గంటల్లో బలనిరూపణ చేసుకోవాలని సూచించారు. దీంతో తమకు మద్దతుగా పలుకుతున్న ఎమ్మెల్యేలతో కలిసి తమ సంఖ్యాబలాన్ని మీడియా ఎదుట ప్రదర్శించింది ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ కూటమి. మూడు పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలతో సహా స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మొత్తంగా 162 మంది ఎమ్మెల్యేలను మీడియా ముందుకు తీసుకువచ్చారు. 

 

 

 

 కాగా  ఈ అందరి ఎమ్మెల్యేలను ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో కి చేర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది .. ఈ కేసుపై తుది తీర్పును రేపు వెలువరించనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. కాగా అంతకు ముందుగానే ఈ మూడు పార్టీలు బలప్రదర్శనకు దిగారు. ఈ పరేడ్ను గవర్నర్ చూస్తారని తాము ఆశిస్తున్నట్లు శివసేన నేతలు పేర్కొంటున్నట్లు సమాచారం. గవర్నర్ సాబ్  మావద్ద 162 మంది ఎమ్మెల్యేల బలం ఉంది చూడండి అని ఇప్పటికే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్క  ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

 

 

 

 మరోవైపు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే   కూడా ఇదే రీతిలో స్పందించారు . అంతేకాకుండా ఈ మూడు పార్టీలు తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉంది అని చాటుతూ హోటల్లో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయటం గమనార్హం  . కాగా  ఈ హోటల్ వద్దకు చేరుకున్న ప్రముఖుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్కాంగ్రెస్ నేతలు మల్లికార్జునఖర్గే,  అశోక్ చవాన్,  బాలసాహెబ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే,  ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ శివసేన కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలు 162 మంది ఎమ్మెల్యేలను సంఖ్యాబలం ఉందని చెబుతుండడం చూస్తుంటే... బిజెపి ప్రభుత్వానికి సంఖ్యాబలం నిరూపించుకోవడంలో  విఫలం అయ్యేట్లు  కనిపిస్తోంది. కాగా  బలనిరూపణ కోసం సుప్రీం కోర్టు రేపు ఎలాంటి కీలక తీర్పును వివరించనుందో  అని మహా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: