వైసీపీ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ స్టైలే సపరేటు. ఆయన జగన్ తండ్రి హయాంలోనూ మంత్రిగా పని చేశాడు. పీసీసీ అధ్యక్షుడిగానూ పని చేసిన వ్యక్తి. అయితే అమరావతి విషయంలో ఆయన చేస్తున్న కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. అలాంటి బొత్స మరోసారి అమరావతి విషయంలో షాకింగ్ కామెంట్లు చేశారు.

 

అమరావతి పర్యటనకు వచ్చే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారట.. ఏం చూస్తారు.. స్మశానం.. చూసి ఏడవడానికా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది తాను ఏమన్నాడో.. వెంటనే కవరింగ్ చేశారు. నేను స్మశానం అంటే.. ఇక్కడ ఏమీలేదని.. మళ్లీ మీరు విపరీత అర్థాలు తీయకండి అంటూ జర్నలిస్టులతో కవర్ చేసుకున్నారు.

 

ల్యాండ్‌ పూలింగ్‌ అని 38 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబుకు వాటిని డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉంది కదా.. ఐదేళ్లు గొర్రెలు కాశారా..? బాధ్యత లేదా..? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు చెప్పుకుంటూ ఐదేళ్లలో రాజధానికి కేటాయించింది రూ.4900 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్‌లు మాత్రమే కనిపిస్తాయని, అవి కూడా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమేనని, చంద్రబాబు 50 సంవత్సరాలు అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు.

 

 

చంద్రబాబు విధానం నచ్చకే ప్రజలంతా ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కు తీసుకున్న భూములను డెవలప్‌ చేసి ఇచ్చే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమీక్షలో సీఎం అన్ని విషయాలపై ఆరా తీశారన్నారు. అమాయకుడు ఎవడు దొరికితే వాడిని ముంచేయడమే చంద్ర బాబు విధానమన్నారు. బాబు వైఖరిపై అమరావతి రైతులంతా ఆగ్రహంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: