ప్రధాని నరేంద్ర మోడీ 15 రోజులకు ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆకాశవాణి ద్వారా ప్రజలకు సందేశం చేరుస్తుంటారు. ఆయన తాజాగా మాతృభాష గురించి .. దాన్ని ఔన్నత్యం గురించి ఆయన తన మన్ కీ బాత్ కార్యక్రమలో మాట్లాడారు. మాతృభాషతోనే అభివృద్ధి సాయం అని ప్రధాని అన్నట్టు పత్రికలు రాసుకొచ్చాయి.

 

మిగిలిన దేశం వరకూ ఎలా ఉన్నా.. ప్రధాని వ్యాఖ్యలు జగన్ గురించే అని అనేందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. తాజాగా మోడీ.. ప్రధాని మాతృభాష గురించి గవర్నర్ల సదస్సులో మాట్లాడితే దానికి కొన్ని పత్రికలు వక్రభాష్యాన్ని తీసుకువచ్చాయి. అందుకే ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. మాతృభాషకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి సీఎం వైయస్‌ జగన్‌ ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువస్తున్నారన్నారు.

 

దానికి ప్రతిపక్షాలు, పచ్చ పత్రికలు ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తప్పుడు కథనాలు రాసే పత్రికలు, మాట్లాడే నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలి. పేద, మధ్యతరగతి పిల్లలు ఇంగ్లిష్‌లో చదువుకోకూడదా..? అని ప్రశ్నించారు. పేదవారంటే ఎందుకంత కక్ష అని నిలదీశారు.

 

గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే చాలా మంది వ్యతిరేకించారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలని వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారన్నారు. అంటిదే ఈ ఇంగ్లిష్‌ మీడియం కూడా.. అయితే దీనికి ఎవరికి అనుకూలంగా వారు తీర్పులు ఇచ్చుకుంటున్నారు.

 

అయితే.. మోడీ జగన్ ను టార్గెట్ చేశాడని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అందువల్ల వారికి తక్షణం ఒరిగే ప్రయోజనం లేకపోయినా దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయన్నది ఆర్టీ వాదన. దిల్లీ వ్యవహారాల్లో ఏదో ఒక అండ జగన్ కు తప్పనిసరి అవసరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: