52 రోజుల సమ్మె ఫలితం బూడిదలో పోసిన పన్నీరు అయినట్టేనా అంటే అవుననే అనిపిస్తోంది.  తమ డిమాండ్లునెరవేరాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కోరుతూ కార్మికులు అక్టోబర్ 5 నుంచి నిరంతరాయంగా సమ్మె చేశారు.  రేయనకా, పగలననకా ఎన్నో ఏళ్ళు ఆర్టీసీ కోసం సేవలుఅందిస్తే .. ఇప్పుడు వాళ్ళను కాదని చెప్పి  ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తున్నారు. 
సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించి విధుల్లోకి వస్తామని అంటే.. ఇప్పుడు కాదని ప్రభుత్వం చెప్తున్నది.  సమస్య లేదని, విధుల్లోకి తీసుకోబోమని తెగేసి చెప్పింది.  52 రోజుల పాటు తిండి తిప్పలు మానేసి సమ్మె చేస్తే.. కనీసం ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు.  తమ 26 డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.  నెరవేర్చకపోగా, విధుల్లో చేరాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది.  పైగా ఇప్పడు 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులను తిప్పేందుకు సిద్ధం అవుతున్నది.  
దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.  కీలక నిర్ణయం ఏంటి అన్నది త్వరలోనే తేలిపోతుంది.  ఆర్టీసీని పక్కన పెట్టి ప్రైవేట్ వాళ్లకు బస్సులు అప్పగిస్తే.. మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి.. వారిని ఉద్యోగాల మాట ఏంటి.. 50వేల కుటుంబాలు రోడ్డున పడాల్సిందేనా.. కోర్టు కూడా ఏమి చేయలేదా.. జేఏసీని, కోర్టును నమ్ముకొని సమ్మె చేసిన వారి బతుకులు కట్టెలోకి వెళ్లాల్సిందేనా.. 
ప్రభుత్వం వీరి గురించి పట్టించుకోదా.. ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే.  ఎందుకంటే.. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే దీనిపై స్ఫష్టంగా చెప్పింది.  సమ్మె చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని చెప్పింది.  అలానే, బస్సులను అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అంటోంది.  మరోవైపు ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను  రావొద్దని చెప్పింది.  ప్రైవేట్ వాళ్ళు కాబట్టి రాకపోయినా వాళ్లకు పెద్దగా వచ్చిన నష్టం లేదు.  కానీ, ఆర్టీసీ కార్మికులను వద్దని ప్రభుత్వం ఆదేశిస్తేనే చిక్కులు వస్తాయి.  మరి ఈ చిక్కుల నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: