ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే.  ఢిల్లీలో ఎక్కడ చూసినా కాలుష్యం.  మామూలుగానే ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం ఉంటున్నది.  ఇప్పుడు మంచు కురిసే సమయం.  చలికాలం. వాతావరణం తేమగా ఉంటుంది.  ఈ తేమ కారణంగా కాలుష్యం మొత్తం చుట్టూ వ్యాపించి ఉంటుంది.  గాలిలో కలిసి పోవడం అంటూ జరగదు.  దీంతో గాలిలో ప్రాణవాయువు శాతం తగ్గిపోతుంది. ఫలితంగా ఊపిరి ఆడదు.  
ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  అందుకే దీని నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నా కుదరడం లేదు.  అసలు ఢిల్లీలో ఈ స్థాయిలో కాలుష్యం ఉండటానికి కారణం ఏంటి అంటే దానికి ప్రధాన కారణం ఒక్కటే.. వాహనాల సంఖ్య పెరగడం.. పాత వాహనాలు రోడ్డుపై తిరగడం.. అంటున్నారు.  కేవలం దీనివలన మాత్రమే ఢిల్లీలో కాలుష్యం పెరిగింది అనుకుంటే పొరపాటే.  దీనివల్లనే ఢిల్లీ కాలుష్యం పెరగలేదు.  
ఢిల్లీలో ఈ స్థాయిలో కాలుష్యం పెరగడానికి కారణం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు.  పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలనుంచి వచ్చే పొగ కారణంగా ఢిల్లీ మాడిపోతున్నది.  ఆయా రాష్ట్రాల్లో పంటకు సంబంధించిన వేస్ట్ ను పొలాల్లోనే తగలబెడుతున్నారు.  ఇలా తగలబెట్టడం వలన వచ్చే పొగ ఢిల్లీని కమ్మేస్తున్నది. ఇలా ఢిల్లీని కమ్మేయడం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఇది వాస్తవం.  
ఢిల్లీని ఇలానే వదిలేస్తే.. మరికొన్ని రోజుల తరువాత చిత్రపటంలో ఢిల్లీ మనకు కనిపించదు.  ఢిల్లీ స్థానంలో పొగ మాత్రమే కనిపిస్తుంది.  ఇప్పటికే సుప్రీం కోర్టు దీనిపై సీరియస్ అయ్యింది.  ఇలా పొగబెట్టి చంపే బదులు ఒక్కసారే ఢిల్లీని బాంబులు పెట్టి పేల్చేయండి అని సీరియస్ అయ్యింది అంటే ఢిల్లీ ఎంత డేంజర్ లో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  ఇప్పుడు చేయాల్సింది ఏమంటే.. ఢిల్లీలో అర్జెంట్ గా కాలుష్యాన్ని నివారించడం లేదంటే ఢిల్లీ నుంచి రాజధానిని మార్చడం.  ఢిల్లీ నుంచి రాజధానిని మార్చడం కుదరదు కాబట్టి కాలుష్యాన్ని నివారించడం ఒక్కటే పరిష్కారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: