ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ తగ్గకుండా.. ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందించాలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాడు సీఎం జగన్. అయితే రైతు కోసమే తన ప్రభుత్వం అని చెప్పే సీఎం జగన్ ఇప్పటికే రైతులకు కావాల్సినన్ని వరాలు ఇచ్చాడు.  

 

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ రాజధాని రైతులకు శుభవార్త చెప్పాడు. అమరావతిలో నిర్మాణాలపై నిన్న సమీక్షా నిర్వహించిన సీఎం జగన్.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనులు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు కొనసాగించాలని.. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగిస్తామని సీఎం జగన్ తెలిపారు. 

 

రాజధానిలో నిలిచినా పనులకు నిధులిచ్చేనందుకు సిద్ధమని సీఎం జగన్.. రాజధాని రహదారుల డిజైన్ల ప్లానింగ్ లో తప్పులుండకూడదని, దీనికోసం ఐఐటీల సలహాలు కూడా తీసుకోవాలని సూచించారు. కాగా ఈ విషయాలన్నీ ట్విట్టర్ వేధికగా ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుండి వెల్లడించారు. 

 

దింతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది.. మా ముఖ్యమంత్రి రాజు.. రైతుల రాజ్యంగా మార్చడు అని ఒకరు కామెంట్ పెట్టగ మరికొందరు స్పందిస్తూ.. సీఎం జగన్ అంటేనే దేవుడు.. ఎవరికి ఎక్కడ కష్టాలు ఉన్న ఆదుకుంటాడు అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. కాగా ఈ వార్త రాజధాని రైతులకు శుభవార్త అనే చెప్పాలి.  

 

మరి ఈ విషయాలపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. సీఎం జగన్ చేసే ప్రతి మంచిపనికి అడ్డు పుల్లా వెయ్యాలని చూసే ప్రతిపక్షాలు.. వారు చెయ్యలేని పనులు సీఎం జగన్ ఎంతో ధైర్యంతో చేసే సరికి చూసి తట్టుకోలేని ప్రతిపక్షాలు ఎప్పుడులనే నేడు కూడా కూడా బురద చల్లడానికి ప్రయత్నిస్తాయి అని రాజకియా విశ్లేషకు చెప్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: