నవంబర్ 26 దేశంలో ఓ ప్రముఖమైన రోజు.  ఈరోజు గురించి చాలా మందికి తెలియదు.  నవంబర్ 26 వ తేదీని భారత ప్రభుత్వం రాజ్యాంగం రోజుగా జరుపుకుంటుంది.  1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగానికి ఆమోదం ముద్ర వేశారు.  1960 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.  అందుకే నవంబర్ 26 వ తేదీని నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్ గా పిలుస్తారు.  
ఈరోజు నేషనల్ లా డే.  కానీ, ఈరోజు జాతీయ సెలవు దినం కాదు.  ఈ ఏడాది నేషనల్ లా డే ఉత్సవాన్ని జమ్మూ కాశ్మీర్లో అంగరంగ వైభవంగా జరపబోతున్నారు.  జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు పూర్తిగా ఇండియాలో అంతర్భాగం అయ్యింది కాబట్టి నేషనల్ లా డే ను అక్కడ నిర్వహించబోతున్నారు.  లా డే రోజున దేశంలో ముఖ్యమైన వాటిపై ఈరోజున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతున్నది.  
అదే మహారాష్ట్ర తీర్పు.  మహారాష్ట్ర తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు.  తీర్పు ఎవరికీ అనుకూలంగా ఉండబోతుంది. ఈ తీర్పులో ఏం చెప్పబోతున్నారు అన్నది ఉత్కంఠంగా మారింది.  మహారాష్ట్ర వంటి రాష్ట్రాన్ని బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోదు.  అది వాస్తవమే.  ఎందుకంటే, బీజేపీ ఈసారి వదులుకుంటే దాని వలన కలిగే నష్టాలు తెలుసు.  ఎందుకంటే, దేశానికీ వాణిజ్య రాజధాని ముంబై నగరం.  
ఇక్కడ ఆధిపత్యం చలాయిస్తేనే.. దేశంలో ఎక్కడి నుంచైనా ధైర్యంగా అడుగు వెయ్యొచ్చు.  ప్రాంతీయ పార్టీల కంటే కూడా ముంబైలో బీజేపీ బలంగా ఉన్నది.  శివసేన, ఎన్సీపీ పార్టీలు బీజేపీ కంటే ముందునుంచే ఉన్నాయ్.  కానీ, వాటితో సైతం పోటీ పడి, వాటిని పక్కకు నెట్టి బలంగా మారింది.  ఇదే ఇప్పుడు పార్టీకి బలం అయ్యింది.  గతంలో కంటే సీట్లు తగ్గినా.. పోటీ చేసిన స్థానాలు తక్కువ.  ఇంకా చెప్పాలి అంటే సీట్లు తగ్గినా.. ఓటు శాతం పెంచుకుంది.  మరి ఈరోజున ఏం జరగబోతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.  చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: