బీజేపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు.  బీజేపీ ఒక పాలసీని నమ్మి దాని ప్రకారం ఫాలో అవుతుంది.  ఆ పాలసీని విడిచి బయటకు రాదు.  ముఖ్యంగా రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించదు బీజేపీ. దేశ రాజకీయాలకు, దేశానికీ అది మంచిది కాదని బీజేపీ వాదన.  అన్ని ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంటుంది.  కానీ, ఒక్క రాజకీయ రంగానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు.  చదువు వంటి అర్హత కూడా అవసరం లేదు.  రాజకీయాలు చేయాలనే ఒక నమ్మకం ఉంటె చాలు.  దేనికైనా తెగించే తత్త్వం ఉంటె చాలు.  ఎలాగైనా గెలవాలని పోరాటం చేసే దమ్ముంటే చాలు రాజకీయాల్లో రాణించవచ్చు.  ఆకట్టుకునే విధంగా మాట్లాడే తత్త్వం ఉంటె మీరే నాయకులు అందులో నో డౌట్.  ఈ క్వాలిటీలు ఉంటె రాజకీయాల్లోకి ఎవరైనా ఎంట్రీ కావొచ్చు.  కానీ, ప్రాంతీయ పార్టీల్లో మనుగడ సాగించడం చాలా కష్టమైన విషయం.  ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం ఉంటుంది.  వాటిని దాటుకొని ఎదగాలి అంటే కష్టం.  
అందుకే అందరి చూపులు బీజేపీవైపు ఉంటాయి.  ఎందుకంటే అక్కడ వారసత్వానికి చోటు ఉండదు.  పైగా టాలెంట్ ఉంటె ఎవరైనా సరే ఎదగొచ్చు.. ఎలాగైనా ఎదగొచ్చు.  అందుకు ఉదాహరణ నరేంద్ర మోడీ.  చిన్నప్పటి నుంచి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగారు. ప్రధాని వరకు అయన ఎదిగిన తీరు అమోఘం.  అయితే, ఇపుడు బీజేపీలో రిటైర్మెంట్ వయసును నిర్ణయించారు.  75 సంవత్సరాలు దాటిన వ్యక్తులు దేశ రాజకీయాల నుంచి తప్పుకోవాలనే పాలసీని దేశరాజకీయాల్లో తీసుకొచ్చారు.  
దీని ప్రకారం మోడీ వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది.  ఒకవేళ మోడీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మోడీ ఒక సంవత్సరం ప్రధానిగా చేసి ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది.  ఆ తరువాత ప్రధానిగా ఎవరు ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పదవిని అప్పగించారు ప్రధాని మోడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: