ఏపీ మంత్రులకు పెద్ద పరీక్ష ఎదురైంది పాస్ కాకుంటే పదువులు ఊస్టింగే అని మొహం మీదే చెప్పేసారు సీఎం జగన్. కనీసం రెండున్నర ఏళ్ళు అయినా పదవుల్లో ఉండొచ్చు అనుకున్న మంత్రులకు ఇదొక మింగుడు పడని వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు దాటింది. ప్రమాణ స్వీకారం రోజున ఆరు నెలల లోపే మీతో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

 

ఏపీ లో ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నా సందర్బంగా జగన్ ఏపీ మంత్రులతో ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ మధ్య. సమావేశంలో పాలనపై ప్రజలు ఏం అనుకుంటున్నారు, సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నారా, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా ఇలా పలు విషయాలపై మంత్రులతో చర్చించారు సీఎం. ఈ సందర్బంగా మంత్రులకు ఒక పరీక్ష పెడుతున్నట్లు కేబినెట్ మీటింగ్ లో ప్రకటించారు జగన్, ఎవరైతే ఈ పరీక్షల్లో పాస్ ఎవ్వరో వాళ్ళ మంత్రి పదవులు వదులుకోవాల్సి ఉంటుందని బాంబు పేల్చారు జగన్. ఇక జగన్ ప్రకటనకు తెల్ల మొహాలు వేశారు మంత్రులు. 

 

ఇంతకీ పరీక్ష ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం తమ పాలన మీద ప్రజాతీర్పు తీసుకోవాలని భావిస్తోంది. మార్చి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టులో ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని వైఎస్ జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాను అమలు చేసిన పథకాలకు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇస్తానని ఆశిస్తున్నారు. అయితే, తమ ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత, అవి ఓట్ల రూపంలోకి మార్చాలిన బాధ్యతను కేబినెట్ మంత్రుల మీద పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు ఆయా మంత్రులకు అప్పగించారు. తక్కువ సీట్లు వచ్చిన జిల్లాల్లో, ఆయా జిల్లా మంత్రులు పదవులు కోల్పోవాల్సి వస్తుంది. ఇదేమి కొత్తేమీ కాదు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా తక్కువ సీట్లు వచ్చాయని పశ్చిమగోదావరి జిల్లా మంత్రిగా ఉన్న మాగంటి బాబును వైఎస్ కేబినెట్ నుంచి తొలగించారు. ఇక జగన్ కూడా తండ్రి బాటలో నడుస్తున్నారన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: