బడికి వెళ్లే పిల్లలకు ఎన్నో పధకాలు రూపొందిస్తున్నారు.  మధ్యాహ్నం భోజనం పధకం, పుస్తకాలూ, బట్టలు, ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ ఇలా ఎన్నో ఉన్నాయి.  వీటిని పక్కాగా ప్రభుత్వాలు అమలు చేస్తుంటాయి.  అయితే, స్కూల్లో ఉన్నంతసేపు చదువుకున్న పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్కూల్ పుస్తకాలూ బ్యాగ్ పక్కన పడేసి ఏం చేస్తున్నారో తెలుసా ?


ఈ విషయం ఎవరికీ ఎంత వరకు తెలుసో తెలియదో తెలియదుగాని, ఒక్క విషయం మాత్రం అందరికి స్పష్టంగా తెలుసు.  అదేమంటే పిల్లలు ఇంటికి రాగానే అందరూ పుస్తకాలు పక్కన పడేసి స్మార్ట్ ఫోన్స్ లో తల దూర్చేస్తున్నారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్స్ తో ఆటలు ఆడుతున్నారు.  ఇది చాలా విచిత్రమైన పరిస్థితి.  ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే తప్పకుండా ప్రభుత్వ సహకారం కావాలి.  
అందుకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.  తల్లిదండ్రులను ఒప్పింది స్కూల్ పిల్లలకు ఓ టాస్క్ ఇచ్చింది.  ఈ టాస్క్ లో భాగంగానే స్కూల్ పిల్లలకు కోడిపిల్లలు ఇచ్చింది.  వాటిని జాగ్రత్తగా పెంచాలి.  వాటితో ఆడుకోవాలి .  స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక వాటిని గురించి టాస్క్ రాయాలి.  ఇలా చేయడం వలన పిల్లలు స్మార్ట్ ఫోన్స్ నుంచి బయటకు వస్తారని ప్రభుత్వం అభిప్రాయం.  
అంతేకాదు, పిల్లలు కొన్ని మిరప విత్తనాలు ఇచ్చి, వాటిని ఇంట్లో నాటి వాటికి నీరుపోసి మొక్కలు అయ్యేలా చూడాలి.  వాటి నుంచి మిరపకాయలను పండించే  బాధ్యత పిల్లలదే అనిప్రభుత్వం చెప్పడంతో ఇప్పుడిప్పుడే అక్కడి పిల్లల్లో మార్పులు వస్తున్నాయి.  ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. మనదగ్గరైతే కాదు.. ఇండోనేషియాలోని బందంగ్ నగరంలో.  ఈ పధకం అక్కడ సక్సెస్ కావడంతో దేశం మొత్తం విస్తరించాలని చూస్తున్నారు.  ఇంకెందుకు మనదగ్గర కూడా ఇలాంటి పధకం విస్తరింపజేస్తే పోలా. 

మరింత సమాచారం తెలుసుకోండి: