రాజధాని అమరావతి గురించి ఇప్పటి వరకు ఎంత పెద్ద చర్చ జరిగిందో మనకు తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తున్నట్టు పెద్ద చర్చ జరిగిన సంగతీ తెల్సిందే. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం, ఇప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు నిర్దేశించిన అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ కూడా ఓకే చెప్పేసినట్టేనని చెప్పక తప్పదు. ఈ మేరకు నవ్యాంధ్ర నూతన రాజధానిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారని వస్తున్నవాదనలన్నీ తప్పేనన్నట్లుగా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. 


దీనితో ఇప్పటి వరకు రాజధాని విషయంలో ఉన్న సందేహాలు అన్ని నివృత్తి అయినట్టేనని చెప్పాలి. అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ తన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. మొత్తంగా తాను అధికారంలోకి వచ్చినా... రాజధానిని అమరావతి నుంచి తరలించబోనని ఎన్నికల ముందే చెప్పిన జగన్... తన మాట మీదే నిలబడ్డారన్న మాట.  రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసే విషయంపై సోమవారం అధికారులతో సమీక్షించిన జగన్... సీఆర్డీఏ పరిధిలో ఇప్పటికే ప్రారంభమైన పనులను ప్రధాన్యతా క్రమంలో త్వరితగతిన, వీలయినంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 

జగన్ .. రాజధాని గురించి అనవసరపు చర్చ నడిస్తే చివరికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించాడు. అయితే ఇప్పటి వరకు నానా హంగామా చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరు మూసుకోవాల్సిందే. జగన్ నోట నుంచి వచ్చిన ఈ ఒక్క మాటతోనే రాజధానిని అమరావతిలోనే కొనసాగించనున్నట్లుగా జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లుగానే చెప్పాలి. అంతేకాకుండా... రాజధాని అమరావతి నుంచి ఎక్కడ తరలిపోతుందోనని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో నెలకొన్న ఆందోళన జగన్ ఇచ్చిన హామీతో ఇక ఉండదని చెప్పాలి. ప్రతిపక్షాలకు ఇక ఏ విషయం దొరకదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: