మహారాష్ట్రలో అంత హాట్ హాట్ గా ఉంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరించనుంది అనేది ప్రస్తుతం  ఉత్కంఠగా మారిపోయింది. ఇప్పటికే మహారాష్ట్రలో హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. అయితే నిన్న  దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం ఫడ్నవీస్ కు  సంఖ్యాబలం ఉందా అంటూ ప్రశ్నించారు... జస్టిస్ ఎన్వి రమణ సంజీవ్ కన్నా  అశోక్ భూషన్  సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుంది .కాగా  కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా  వాదనలు వినిపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో  గవర్నర్ భగత్ సింగ్ కొశ్యరి   ఏకపక్ష నిర్ణయం కాదని... ఎన్నికల ముందు ఉన్న పొత్తులపై గవర్నర్ పూర్తి అవగాహన ఉందని సుప్రీం కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా గవర్నర్ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మధ్య ప్రభుత్వ  ఏర్పాటుకు సాగిన లేఖను గవర్నర్ కు  సమర్పించారు   తుషార్ మెహతా. 

 

 

 

 కాగా  అజిత్ పవార్ తరుపున వాదనలు వినిపించారు మనిందర్ సింగ్ . ఈ సందర్భంగా అజిత్ పవార్ సుప్రీంకోర్టుకు సమర్పించిన లేఖలు.. ఎన్సీపీ నాదేనని... 54 మంది ఎమ్మెల్యేలు పార్టీ తరఫున నిర్ణయాన్ని  తీసుకునే  అధికారాన్ని తనకు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంలో మరో మాట లేదని తన కుటుంబంలో వచ్చిన  గొడవ తొందర్లోనే పరిష్కారం అవుతుంది అంటూ అజిత్ పవార్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ నిర్ణయాలను సుప్రీంకోర్టు సమీక్షించే ప్రసక్తి లేదని... బలనిరూపణ   నిర్వహించాలనే దానిపై కూడా తుది నిర్ణయం గవర్నర్ దేనని...  సుప్రీంకోర్టు బలపరీక్ష ఎప్పుడు నిర్వహించాలనేది  చెప్పే అధికారం లేదంటూ తుషార్ మెహతా వాదన  వినిపించారు. 

 

 

 

 కాగా  ఈ కేసుపై విచారణను నేటికీ  సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా మహా  బలపరీక్ష పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందోనని మహారాష్ట్ర పార్టీలు ప్రజానీకం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా అటు 288 అసెంబ్లీ స్థానాలకు మహారాష్ట్రలో ఎన్నికలు జరగగా... బిజెపి105,  శివసేన 56 ఎన్సీపీ 54,  కాంగ్రెస్44 స్థానాలలో విజయం సాధించింది. దీంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఇతర పార్టీల మద్దతు అనివార్యమైంది. ఈ క్రమంలో ఇండిపెండెంట్లు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు . ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పార్టీలకు 145 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాల్సి ఉంది. 

 

 

 

 బిజెపికి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మద్దతు తెలిపినప్పటికీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం ఎమ్మెల్యేలందరూ తన వెంటే ఉన్నారని బిజెపి మద్దతు తెలపడం అజిత్ పవార్ సొంత నిర్ణయం అంటూ తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీలు కలిపి 144 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా కొంతమంది రెబల్స్ వారికి మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.ఈ క్రమంలో  ఈ మూడు పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా నిన్న 162 మంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన పార్టీలు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో  మీడియా ముందు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహా రాష్ట్ర రాజకీయాలల్లో  ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: