జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ అరాచకవాదిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ట్వీట్లు, టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు. పిచ్చివాడిలాగా, ఉన్మాదిలాగా, అరాచకవాదిలాగా పవన్‌ కళ్యాణ్‌ ప్రవర్తిస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదు నెలలు కూడా కాలేదని మల్లాది విష్ణు అన్నారు.

 

పవన్‌కు చిత్తశుద్ధి, దమ్ము ఉంటే ఆయన చేసిన ట్వీట్లపై బహిరంగ చర్చకు రావాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రగిలిస్తూ రాష్ట్రంలో చీలికలు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. పవన్‌కు తెలియకపోతే మీ పార్టనర్‌, మీ దత్తత తండ్రి చంద్రబాబును అడగాలని మల్లాది విష్ణు సూచించారు. ఐరోపా వెళ్లినప్పుడు ఒక మాట, హైదరాబాద్‌లో మరో మాట, అమరావతిలో ఇంకో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు.

 

పవన్‌ కళ్యాణ్‌కు రెండు చోట్లా ప్రజలు బుద్ధి చెప్పినా జ్ఞానోదయం కలుగలేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు చేతిలో ఆయన కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు చూసి పక్కదారి పట్టించేలా కుట్రలు చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదని చెప్పారు. పవన్‌..మీరు చేసిన ట్విట్లపై వైయస్‌ఆర్‌సీపీ తరఫున చర్చకు సిద్ధంగా ఉన్నామని మల్లాది విష్ణు సవాలు చేశారు.

 

 

అవినీతి, హిందు ధర్మంపై దాడి జరిగితే ఐదు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మల్లాది విష్ణు ప్రశ్నించారు. దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆలయాల నుంచి వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని మల్లాది విష్ణు వివరించారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: