ఐదేళ్ళ పాలనలో తాను ఫెయిల్యూర్ అయినట్లు చంద్రబాబునాయుడే ఒప్పేసుకున్నారు. కడప జిల్లా పర్యటనలో మాట్లాడుతూ తాను ఫెయిల్యూర్ అయినట్లు పొరబాటున ఒప్పేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అయ్యింది. ఈ ఐదు నెలల్లోనే జగన్ దెబ్బకు చాలా పరిశ్రమలు వెళ్ళిపోయినట్లు నానా యాగీ చేస్తున్నారు.

 

అయితే ఇదే సందర్భంలో తన చేతకానితనాన్ని కూడా  బయటపెట్టేసుకున్నారు. జగన్ వచ్చిన ఐదు నెలల్లోనే తిరుపతి దగ్గర 15 వేల కోట్ల రూపాయలతో రావాల్సిన రిలయన్స్ కంపెనీ, విశాఖపట్నంలో రూ 70 వేల కోట్ల అదాని గ్రూపు, ప్రకాశం జిల్లాలో రూ 85 వేల కోట్ల అంచనాతో వచ్చిన  పేపర్ మిల్లు పరిశ్రమ రాష్ట్రం నుండి వెళ్ళిపోయినట్లు మండిపడ్డారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి దగ్గర రిలయన్స్ కు కేటాయించిన భూమి లిటిగేషన్లో ఉంది. ఆ విషయాన్ని రిలయన్స్ సంస్ధే ప్రకటించింది. ప్రత్యామ్నాయ భూమిని జగన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది కాబట్టి పరిశ్రమ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఇక విశాఖపట్నంలో అదాని గ్రూపు వెళ్ళిపోలేదని ప్రభుత్వం ప్రకటించింది. యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుపుతున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా చెప్పారు.

 

ఇక పేపర్ పరిశ్రమను తాము తరలించే నిర్ణయమేదీ తీసుకోలేదని పేపర్ పరిశ్రమ యాజమాన్యమే ప్రకటించిన విషయాన్ని బహుశా చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. సరే ఈ విషయాలను పక్కనపెడితే తన ఐదేళ్ళ హయాంలోనే పై పరిశ్రమలన్నీ ఎందుకు ఏర్పాటు కాలేదు ? రిలయన్స్, అదాని గ్రూపు యాజమాన్యాలతో చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి కదా ?  ఐదేళ్ళు సిఎంగా ఉండి ఒక్క పరిశ్రమ కూడా తేలేని చేతకాని తనాన్ని జగన్ పై నెట్టేస్తున్న విషయం అర్ధమైపోతోంది.

 

 

చంద్రబాబు హయాంలోనే పరిశ్రమ ఏర్పాటు జరిగిపోయుంటే ఇపుడు రాష్ట్రం నుండి వెళ్ళిపోయే అవకాశాలుండేవి కాదు కదా ? పరిశ్రమలు వెళ్ళిపోతున్న విషయాలు నిజమే అయితే  అసలు చంద్రబాబే ఆ యాజమాన్యాలతో  చెప్పి పరిశ్రమల ఏర్పాటు కాకుండా చూస్తున్నారేమో అనే సందేహాలు మొదలవుతున్నాయి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: