వంగవీటి రంగా వారసుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో సైలెంట్ అయిపోయిన నేత. ప్రస్తుతం టిడిపి పార్టీలో రంగ పరిస్థితి ఉండలేను వీడలేను  అన్నట్లుగా ఉంది. అప్పటివరకు వైసీపీలో కొనసాగిన వంగవీటి రాధాకృష్ణ 2019 ఎన్నికల ముందు టీడీపీలో పార్టీలో చేరారు. అయితే టిడిపి పార్టీలో చేరినప్పటికీ  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్లు మాత్రం  వంగవీటి రాధాకృష్ణ సాధించలేకపోయారు. అయినప్పటికీ టిడిపి పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు వంగవీటి రాధాకృష్ణ. అయితే గత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో రాజకీయంగా వంగవీటి రాధాకృష్ణ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే 2019 ఎన్నికల తర్వాత టిడిపిని వీడాలని వంగవీటి రాధా నిర్ణయించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. 

 

 

 

 టీడీపీని వీడి జనసేన లో చేరాలని వంగవీటి రాధాకృష్ణ అనుకుంటున్నారని అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చించుకున్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వంగవీటి krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ రెండుమూడుసార్లు భేటీ కావడం కూడా వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారు అనే వార్తలకు క్లారిటీ ఇచ్చింది. అయితే వంగవీటి రాధ జనసేన లోకి వెళ్లడం ఖాయం అనుకుంటున్న తరుణంలో... ఆయన పార్టీ మార్పు విషయంలో మరోసారి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలని దానిపై వంగవీటి రాధా డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వంగవీటి రాధాను మరోసారి వైసీపీ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సమాచారం . వంగవీటి రాధాకృష్ణ కు స్నేహితులైన ఏపీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు మరోసారి వంగవీటి రాధాకృష్ణ ను  వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. 

 

 

 

 వంగవీటి రాధాకృష్ణ వైసీపీ లోకి తీసుకురావడం వల్ల జనసేన లోకి వెళ్ళకుండా అడ్డుకోవచ్చనేది  వైసీపీ వ్యూహం అని టాక్ వినిపిస్తోంది. దీనికోసం సీఎం జగన్ ను  ఒప్పించి వంగవీటి రాధా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం టీడీపీ లో నుంచి ఏ పార్టీ లోకి వెళ్లాలి అనే విషయంలో డైలమాలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ వల్లభనేని వంశీ మంత్రి కొడాలి నాని సూచనలతో యూ టర్న్ తీసుకుని  వైసీపీ లోకి చేరుతారా... లేక జనసేన లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ కు జై కొడుతున్నారా అన్నది  వేచి చూడాలి మరి. ఒకవేళ వంగవీటి రాధాకృష్ణ వైసీపీ లోకి వస్తే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో తలనొప్పిగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: