అప్పట్లో అంటే 70 దశకంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా నవలలు ఆధారంగానే తీశారు. అవి బంపర్ హిట్ అయ్యాయి కూడా. ఆ విధంగా నాటి నాయికలు వాణిశ్రీ, విజయనిర్మల వంటి వారికి  బాగా పేరు కూడా వచ్చింది. ఇక హీరోల్లో ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు నవలా చిత్రాలు చేసిన కధానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తరువాత శోభన్ బాబు ఆ ట్రెండ్ కొనసాగించారు. ఇక ఆ తరువాత సినిమా ఫీల్డ్ యాక్షన్ వైపు మళ్ళిపోయింది.

 

ఈ నేపధ్యంలో మళ్ళీ నవలా చిత్రాలకు ఆదరణ లభిస్తోందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క ఇపుడు ఒక నవలా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.   ప్ర‌ముఖ ర‌చ‌యిత గోవింద్ నిహ్లాని రాసిన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని, ఈ మూవీని గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ డైరెక్ట్ చేస్తారని చెబుతున్నారు.

 

ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ మూవీగా  ఉంటుందని అంటున్నారు. ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్ అనుష్క చేస్తుందని న్యూస్ వచ్చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే నిశ్శబ్దం మూవీని అనుష్క‌ చేస్తోంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో తొలిసారిగా దివ్యాంగురాలిగా అనుష్క నటిస్తోంది. ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్న నేపధ్యంలో అనుష్క మరో మారు వార్తల్లోకి వచ్చింది.

 

ఇక అనుష్క నటించనున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో బిగ్ బాస్ ఫేం అభిరామి వెంక‌టాచ‌లం కీల‌క పాత్ర పోషిస్తార‌ట‌. వేల్స్ ఫిల్మ్ ఇంట‌ర‌న్ఏష‌న్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మొత్తానికి అనుష్క గత రెండు దశాబ్దాలుగా ఎక్కడా తగ్గకుండా తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తోంది. పైగా లేడీ ఓరియెంటెడ్ మూవీల‌తో ఆమె సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: