మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణాన ఏం జరుగబోతోందో ఎవరికీ అంతుబట్టటం లేదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీలన్నీ తమ బలాలు నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బిజేపీ తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం దగ్గరపడడటంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను చేజారిపోనీకుండా సీక్రెట్ ప్రదేశాలకు తరలిస్తున్నాయి. 

 

 

ప్రస్తుతం మహారాష్ట్ర కేసు సుప్రీం రిజర్వ్ చేసింది. శివసేన తమ ఎమ్మెల్యేలను పదిలంగా ఉంచుకునేందుకు 5స్టార్, 7స్టార్ హోటళ్లు, రిసార్ట్‌లను బుక్ చేసుకుంది. ముంబైలోని లెమన్ ట్రీ హోటల్‌తో పాటు ఓ ప్రైవేటు రిసార్ట్‌ను శివసేన ఇందుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బలపరీక్ష జరిగే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉండనున్నారు. విధాన భవన్‌లో 162 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఇచ్చినట్లు శివసేన శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్ షిండే ఓ ప్రకటనలో తెలిపారు. కానీ.. చివరగా ఓ సారి అజిత్‌ను కన్విన్స్ చేస్తామని ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జయంత్ పాటిల్ తెలిపారు. ఇంతటి తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం అర్ధరాత్రి ఏకాంతంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.  వీరిద్దరూ రైతుల సమస్యలపై మాట్లాడుకున్నారని సీఎంవో వివరణ ఇస్తోంది. రైతుల సమస్యలపై వీరు చర్చించారని తెలిపింది. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వీరిద్దరి మధ్యా రాజకీయ చర్చలు జరిగే అవకాశం కూడా ఉందని కొందరు వాదిస్తున్నారు.

 

 

మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రెండ్రోజులుగా అజిత్ పవార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. కానీ.. తానెప్పటికీ ఎన్సీపీతోనే వుంటానని, శరద్ పవారే బాస్ అని అజిత్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ, ఎన్సీపీ కూటమి కలిసి ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని అజిత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: