తాజాగా అవినీతి నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ముందడుగు వేసిన సంగతి అందరికి తెలిసిందే కదా. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్.. క్యాంప్ ఆఫీసులో కాల్ సెంటర్‌ను కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి నిర్మూలనకు మరో కీలక నిర్ణయం తీసుకున్నా సంగతి అందరికి తెలిసిందే కదా. రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగితే ఫిర్యాదు చేసేందుకు ఏకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో 14400 సిటిజెన్‌ హెల్ప్‌లైన్‌ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించడం జరిగింది.. పోస్టర్లను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటూ పలు అధికారులు పాల్కొన్నారు.

 

 

ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి అక్కడి పనితీరు, వివరాలపై అడిగి తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సీఎం తెలియచేయడం జరిగింది. కాల్ సెంటర్ ద్వారా అందిన ఫిర్యాదును 15 రోజుల నుంచి నెల రోజుల్లోగా.. దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. అంతేకాదు టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఇంటలిజెన్స్, ఏసీబీ అధికారులు స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుంది అని తెలిపారు.

 

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అవినీతిని సహించేది లేదని తెలుపుతున్నారు. అధికారులకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవు అని కూడా హెచ్చరించడం జరిగింది. ఆ దిశగానే ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు అందితే కఠినచర్యలు తప్పవని ప్రభుత్వం సంకేతాలు కూడా పంపించడం జరిగింది. మరి ఈ హెల్ప్‌లైన్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంకా...

మరింత సమాచారం తెలుసుకోండి: