మహారాష్ట్రలో బల పరీక్ష నిరూపించుకునేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ కు సుప్రింకోర్టు 24 గంటలు మాత్రమే గడువిచ్చింది.  బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సిఎంను సుప్రిం ఆదేశించింది. దాంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అసలు సిసలైన టెన్షన్ మొదలైంది. ఎందుకంటే బలనిరూపణకు అవసరమైన 145 ఎంఎల్ఏ మద్దతు ఉందంటూ ఇటు బిజెపి+ఎన్సీపి చీలిక వర్గం, అటు మూడు పార్టీల కూటమి ఊదరగొడుతున్నాయి.

 

మొత్తం మీద చూస్తుంటే బిజెపి+ఎన్సీపి చీలిక వర్గానికి షాక్ తప్పదని తేలిపోయింది. ఎందుకంటే తమకు 170 ఎంఎల్ఏలు  మద్దతిస్తున్నట్లు ఫడ్నవీస్, అజిత్ పవార్ చెప్పుకుంటున్నారే కానీ అందుకు ఆధారాలను మాత్రం చూపటం లేదు. అదే సమమంలో ముంబాయ్ లోని ఓ ప్రముఖ హోటల్లో క్యాంపు నిర్వహిస్తున్న శివసేన+ఎన్సీపి శరద్ పవార్ వర్గం+కాంగ్రెస్ ఎంఎల్ఏలు 165 మంది ఎంఎల్ఏలతో పరేడ్ నిర్వహించారు. అదికూడా మీడియా ముందే పరేడ్ నిర్వహించటం గమనార్హం.

 

సరే హోటల్లో పరేడ్ నిర్వహించినంత మాత్రాన అందరూ ఎంఎల్ఏలూ మూడు పార్టీల కూటమికే మద్దతు పలుకుతారా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే ఫడ్నవీస్ నేతృత్వంలోని బిజెపి, ఎన్సీపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ ఆ స్ధాయిలో ప్రలోభాల వలను విసురుతున్నారు.

 

ఇపుడు సిఎంగా ఉండటం, కేంద్రంలో అధికారంలో ఉండటం బిజెపికి బాగా కలిసి వచ్చే అంశం. దానికితోడు గవర్నర్ కోషియారి కూడా బిజెపికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రతిపక్షాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే ఏదేమైనా ఎంఎల్ఏల బలం తేలాల్సింది రాజ్ భవన్లో కాదని అసెంబ్లీలోనే అని సుప్రింకోర్టు స్పష్టం చేసిన నేపధ్యంలో ముంబాయ్ లో పొలిటికల్ హీట్ నిముష నిముషానికి పెరిగిపోతోంది. మొత్తం మీద బలనిరూపణ విషయంలో  మహారాష్ట్ర పరిణామాలు కూడా చివరకు కర్నాటకలో అయినట్లుగానే అయి చివరకు బిజెపి పరువు తీసేస్తుందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: