మహారాష్ట్ర మొత్తం  సుప్రీం తీర్పుపై గా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉన్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా కొత్త వ్యూహంతో బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా... ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన పార్టీలు 24 గంటల్లో  బలపరీక్షను నిర్వహించాలని  లేకపోతే బిజెపి పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... గత రెండు రోజుల నుండి సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరిపింది . అయితే దీనిపై సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ 24 గంటల్లో బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

 

 

 ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ఈ  తీర్పును వెలువరించింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బలపరీక్షను జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే బలపరీక్ష పై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహత వాదనలు వినిపించినప్పటికీ  ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. బలపరీక్ష నిరూపణకు గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయమని దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదని సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించిన... తుషార్ మెహతా వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు ఎట్టిపరిస్థితుల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. 

 

 

 

 దీంతో మహా రాజకీయాలు సుప్రీం తీర్పు సంచలనంగా మారింది. 24 లోపు దేవేంద్ర ఫడ్నవిస్ బలనిరూపణ చేయాలని సుప్రీం కోర్టు  ఆదేశించడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి . ఇప్పటికే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు  బిజెపి పార్టీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ  పెట్టకుండా గ్రాండ్ హయత్ హోటల్ కి అందరి ఎమ్మెల్యేలను తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుత మహారాష్ట్రలో హోటల్ రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అప్పటివరకు సైలెంట్ గా ఉన్న బిజెపి పార్టీ రాత్రికి రాత్రి సరికొత్త వ్యూహాన్ని  తెర మీదికి తెచ్చి  సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో బలపరీక్ష చేసుకునేందుకు సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఈ నేపథ్యంలో బిజెపి ఎలాంటి వ్యూహం ప్రయోగించబోతుంది  అనేది కూడా ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో  ఉత్కంఠగా మారింది. రాబోయే 24 గంటల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకుని నిలబడుతుందా లేక శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీల కూటమి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా  తేలిపోనుంది. కాగా మహారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: